Shruti Haasan : ట్రోల్‌ చేస్తే చేశారు కానీ.. నా సినిమా బాగా ఆడింది

దక్షిణాది భామ శ్రుతిహాసన్‌ సినిమాల స్పీడ్‌ పెంచింది. ఆమె నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ ది బెస్ట్‌సెల్లర్‌’. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది.

Updated : 19 Feb 2022 12:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాది భామ శ్రుతిహాసన్‌ సినిమాల స్పీడ్‌ పెంచింది. ఆమె నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ది బెస్ట్‌సెల్లర్‌’. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. వీటితో పాటు బాలకృష్ణ హీరోగా #NBK 107, ప్రభాస్‌తో పాన్‌ఇండియా చిత్రం ‘సలార్‌’ చిత్రాలతో బిజీగా ఉంది. కొద్దికాలం వరకూ తెలుగు చిత్రాలకు గ్యాప్‌ ఇచ్చిన శ్రుతి గతంలో తాను నటించిన తెలుగు చిత్రం ‘ప్రేమమ్‌’ గురించి ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చింది.

‘‘ టాలీవుడ్‌లో నన్ను బాగా ట్రోల్‌ చేసిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది ‘ప్రేమమ్‌’. ఒరిజినల్‌ మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’కి విశేష ఆదరణ లభించింది. మలయాళంలో సాయిపల్లవి చేసిన మలర్‌ పాత్రను తెలుగులో  మీరు చేయండి అని చిత్రబృందం  నన్ను సంప్రదించినప్పుడు ఆ పాత్ర బాగానచ్చినా.. ఒక్క క్షణం మాత్రం చేయకూడదనుకున్నా. కాస్త ఆలోచించి ఎలాంటి తరహా పాత్ర అయినా సరే సవాలుగా స్వీకరించి... నాస్టైల్‌లో చేయాలని మలర్‌ పాత్రను ఒప్పుకొన్నా. ఎవరేమనుకున్నా నాకెందుకు అనుకున్నా. మలర్‌ పాత్ర నాకు బాగా నచ్చింది. అయితే సాయిపల్లవిని మరిపించేలా నటించాలనుకోలేదు. అయినా సరే..! విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. అదృష్టం కొద్దీ ఆ సినిమా విజయం సాధించింది. ఇక ట్రోల్స్‌ని పాజిటివ్‌గా తీసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ‘ఇతరులతో మనల్ని మనం పోల్చుకోకూడదు. అదే విధంగా.. ఎవరైనా సరైన విమర్శలు చేస్తే తప్ప.. నీకు నువ్వు ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఇంకొకరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని