Siddanth Chathurvedi: ఆ సినిమాకి నో చెప్పడంతో అవకాశాలు దూరం చేశారు: సిద్ధాంత్‌ చతుర్వేది

రణ్‌బీర్‌ నటించిన ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో నటించను అని చెప్పినందుకు తన అవకాశాలను దూరం చేశారని సిద్ధాంత్‌ చతుర్వేది అన్నారు.

Published : 09 Mar 2024 18:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది (Siddanth Chathurvedi) ‘గల్లీ బాయ్‌’ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తాను బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకు కారణం ‘బ్రహ్మాస్ర్తం’ సినిమాలో నటించకపోవడమేనని అన్నారు.  ‘‘అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మాస్ర్తం’లో నటించేందుకు ఆడిషన్స్‌ చేయకుండానే నాకు అవకాశం ఇచ్చారు. ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఫాంటసీ చిత్రం. ఇందులో బాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యేసరికి అయిదేళ్లు పడుతుంది. కరాటే వస్తే చాలు అని మేకర్స్‌ నాతో అన్నారు. ఆ అవకాశాన్ని తిరస్కరించాను. వారు అది సరైన నిర్ణయం కాదన్నారు. కానీ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌, అలియాలు నటిస్తున్న చిత్రంలో నన్ను ఎవరు చూస్తారు. అందుకే ఆ సినిమాలో నటించలేనని చెప్పాను. దాంతో నన్ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు’’. ఇది గల్లీబాయ్‌ విడుదలకి ఒక నెల రోజుల ముందు జరిగింది. 

సిద్ధాంత్, అనన్యపాండే ఆదర్శ గౌరవ్‌లతో కలిసి ‘ఖో గయే హమ్‌ కహాన్‌’ చిత్రంలో నటించారు. దీనిని అర్జున్‌ వరైన్‌ సింగ్‌ తెరకెక్కించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని