Takkar OTT: ఓటీటీలో సిద్ధార్థ్‌ ‘టక్కర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సిద్ధార్థ్‌, దివ్యాన్ష జంటగా నటించిన టక్కర్‌మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 05 Jul 2023 15:19 IST

హైదరాబాద్‌: తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్‌. ఇటీవల ఆయన కథానాయకుడిగా కార్తిక్‌ జి.క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘టక్కర్’. దివ్యాన్ష కథానాయిక. జూన్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కథేంటంటే: గుణశేఖర్‌ (సిద్ధార్థ్‌) ఓ పేద ఇంట్లో పుట్టిన కుర్రాడు. తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, అవమానాలకు ఆ పేదరికమే కారణమని బాధ పడుతుంటాడు. అందుకే ఎలాగైనా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవ్వాలన్న ఉద్దేశంతో వైజాగ్‌కు వచ్చి.. చైనా వ్యక్తి వద్ద డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఓరోజు అనుకోకుండా ఆ కారుకు యాక్సిడెంట్‌ అవ్వడంతో.. గుణ యజమాని తనని తీవ్రంగా కొట్టి, దారుణంగా అవమానిస్తాడు. (Takkar movie review) దీంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే వైజాగ్‌లోనే పేరు మోసిన రాజ్‌ (అభిమన్యుసింగ్‌) అనే పెద్ద క్రిమినల్‌ అడ్డాకు వెళ్తాడు. అనంతరం అనుకోని పరిస్థితుల్లో అక్కడున్న రౌడీల్ని కొట్టి.. వాళ్ల కారును ఎత్తుకొచ్చేస్తాడు. అయితే ఆ కారు డిక్కీలో లక్కీ అలియాస్‌ మహాలక్ష్మీ (దివ్యాన్ష కౌశిక్‌) ఉంటుంది. మరి ఆమె ఎవరు? తనని రాజ్‌ ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? ఆమె గుణ జీవితంలోకి ప్రవేశించాక ఏం జరిగింది?(Takkar movie review)  కోటీశ్వరుడు అవ్వాలన్న లక్ష్యంతో జీవిస్తున్న గుణకు ఆమె ఎలా ఉపయోగపడింది? వీళ్లిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? రాజ్‌ గ్యాంగ్‌ నుంచి ఎలా తప్పించుకున్నారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని