Sobhita Dhulipala: భాషతో సంబంధం లేదు.. హాలీవుడ్‌లో ఎంట్రీపై శోభిత కామెంట్స్‌

తన హాలీవుడ్‌ ఎంట్రీపై నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) కామెంట్ చేశారు. మంచి కథ ఉంటే భాషతో సంబంధం లేకుండా నటిస్తానన్నారు.

Published : 06 Feb 2024 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘గూఢచారి’తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala). ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో అలరించిన ఈ భామ హాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘మంకీ మ్యాన్‌’. దేవ్‌ పటేల్ స్వీయ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో తన పాత్రపై శోభిత తాజాగా కామెంట్స్‌ చేశారు.

‘హనుమాన్‌’ మరో రికార్డు.. ఆనందంతో దర్శకుడి పోస్ట్‌

‘‘ఇప్పటి వరకు నేను ఇలాంటి పాత్రలో చేయలేదు. ఇది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. సినిమాపై మరింత గౌరవం, ప్రేమ పెరిగాయి. భావోద్వేగపూరితమైన కథ. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. నేను సవాలుతో కూడిన పాత్రలను చేయడానికి ఎప్పుడూ భయపడను. కొత్త కథలను ఎంచుకోవడంపై దృష్టిపెడతాను. విభిన్నమైన స్క్రిప్ట్‌ ఉంటే భాషతో సంబంధం లేకుండా నటిస్తాను. ‘మంకీ మ్యాన్‌’ నాపై నాకున్న నమ్మకాన్ని పెంచింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనున్నా. ఇందులో దేవ్‌ పటేల్‌ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు’’ అని చెప్పారు. పేదవారిని కాపాడే గొప్ప వ్యక్తిగా తనను తాను భావిస్తూ.. హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లే హీరో కథగా ‘మంకీ మ్యాన్‌’ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన దీని ట్రైలర్‌ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఏప్రిల్‌ 5న ఇది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని