Hanuman: ‘హనుమాన్‌’ మరో రికార్డు.. ఆనందంతో దర్శకుడి పోస్ట్‌

‘హనుమాన్’ మరో రికార్డు నెలకొల్పింది. దీంతో ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఆనందం వ్యక్తం చేశారు.

Published : 06 Feb 2024 12:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌’ (HanuMan). సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా సరికొత్త మైలురాయిని చేరుకుంది. విడుదలైన 25 రోజుల్లో రూ.300కోట్లు వసూళ్లు చేసింది. దీంతో ఈ ఏడాదిలో రూ.300 కోట్లు సాధించిన మొదటి సినిమాగా రికార్డును నెలకొల్పింది (HanuMan Movie Collectons). దీనిపై దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌ పెట్టారు. ‘‘హనుమాన్‌’ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ చిత్రానికి ఎంతోమంది వారి హృదయాల్లో స్థానం కల్పించారు. ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు దీన్ని వీక్షిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.

బాలీవుడ్‌లో చర్చనీయాంశమైన సందీప్ వంగా కామెంట్స్.. స్పందిస్తోన్న ప్రముఖులు

జనవరి 12 విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో ‘సంక్రాంతి సీజన్‌లో రిలీజైన సినిమాల జాబితా’లో.. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నంబరు 1గా నిలిచింది. 92 ఏళ్ల టాలీవుడ్‌ ప్రస్థానంలో ఆల్‌టైమ్‌ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు. ‘‘ఆన్‌స్క్రీన్‌తో పాటు, ఆఫ్‌ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్‌ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి సర్‌ కూడా ఉండొచ్చు’’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఈ సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని