Waltair Veerayya: నిర్మాతలందరికీ చెప్పే మాటే నాన్న నాకూ చెబుతారు: సుస్మిత
ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తనయ సుస్మిత ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్.
హైదరాబాద్: చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు కె. బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శ్రుతిహాసన్ కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా.. చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన చిరంజీవి తనయ సుస్మిత (Sushmita Konidela) మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ...
* ‘వాల్తేరు వీరయ్య’లోని చిరంజీవి దుస్తులు బాగున్నాయి. ఎలాంటి రీసెర్చ్ చేశారు?
సుస్మిత: ఆ సినిమా కథ వింటునప్పుడే కాస్ట్యూమ్స్ విషయంలో కొన్ని ఆలోచనలు వచ్చాయి. వాల్తేరు, పోర్ట్, ఫిషర్ మ్యాన్ తదితర పాయింట్స్ గురించి చర్చిస్తుండగానే థీమ్‌కు తగ్గట్టు డ్రెస్సు ఉండాలని ఊహించుకున్నా. దర్శకుడు బాబీ ‘మాకు చిరంజీవిగారి వింటేజ్ లుక్ కావాలి’ అని చెప్పారు. ‘గ్యాంగ్‌లీడర్’ను గుర్తుచేశారు. నాన్న సినిమాలన్నీ ఎన్నోసార్లు చూశాం. దాంతో పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదు. అలాగే, ఈ సినిమాలో రవితేజ, శ్రుతిహాసన్‌కు వారివారి డిజైనర్స్ పని చేశారు. మేమంతా సమష్టిగా పనిచేశాం.
* కాస్ట్యూమ్స్ విషయంలో మీ నాన్నతో చర్చిస్తుంటారా ?
సుస్మిత: తప్పకుండా చర్చిస్తా. సన్నివేశానికి తగ్గట్టు ఎలా కనిపించాలో ఆయనకే బాగా తెలుసు. ఈ సినిమా విషయంలోనూ ఆయన సూచనలు ఇచ్చారు. లుంగీ, కళ్లజోడు ఎలా ఉండాలో చెప్పారు. ‘వింటేజ్ లుక్ తీసుకొచ్చేందుకు ఇది పీరియాడికల్ మూవీ కాదు కదా’ అని అనుకుని ముందుకు సాగా. అప్పటి, ఇప్పటి డ్రెండ్స్‌పై అవగాహన పెంచుకుని, నాన్నకు నప్పే చొక్కాలను ప్రత్యేకంగా రూపొందించా.
* కుటుంబ సభ్యులు మీ పని గురించి మాట్లాడతారా?
సుస్మిత: లుక్ టెస్ట్ చేసినప్పుడే ఏది బావుంటుందో, ఏది బాగుండదో అనే విషయాన్ని అమ్మ చెప్పేస్తుంది. ఆవిడ ఇన్‌పుట్స్ తీసుకుంటా. సోదరుడు రామ్‌రణ్ కూడా నా డిజైన్స్ చూసి కాల్ చేస్తాడు.
* డిజైనర్‌గా చేస్తూనే నిర్మాణంపై దృష్టిపెట్టారు. నాన్నతో సినిమా చేసే ఆలోచనలు ఉన్నాయా?
సుస్మిత: నాన్నతో సినిమా చేయాలని అందరి నిర్మాతల్లానే నాకూ కోరిక ఉంది. అయితే నేనేమీ ఆ విషయంలో స్పెషల్ కాదు. అందరికీ చెప్పినట్టే ‘ముందు మంచి కథ తీసుకురా వెంటనే చేద్దాం’ అని చెబుతారు. ప్రస్తుతానికి ఆ వేటలోనే ఉన్నా.
* ‘రంగస్థలం’లో రామ్‌చరణ్, ‘వాల్తేరు..’లో చిరంజీవి. మాస్‌గా ఎవరు బాగా కనిపించారు?
సుస్మిత: నాన్నే. మాస్ లుక్‌కు ఆయన సెట్ అయినంత పర్‌ఫెక్ట్‌గా మరొకరు సెట్‌కారని భావిస్తున్నా. ‘వాల్తేరు..’ విషయానికొస్తే.. నాన్న తన లుక్, యాటిట్యూడ్‌ని మార్చుకున్నారు. నేను దాన్ని ఫాలో అయ్యానంతే.
* తదుపరి ప్రాజెక్టులు?
సుస్మిత: ప్రస్తుతం ‘భోళా శంకర్’ (చిరంజీవి హీరో) సినిమాతోపాటు రెండు వెబ్ సిరీస్‌లకు పనిచేస్తున్నా. కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Naresh: నరేశ్ ఎప్పుడూ నిత్య పెళ్లికొడుకే..: రాజేంద్రప్రసాద్
-
World News
Ukraine: యుద్ధంలో కుంగిన ఉక్రెయిన్‌కు ఐఎంఎఫ్ 15 బిలియన్ డాలర్ల చేయూత!
-
India News
Padma awards: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వీడియో వీక్షించండి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
CM KCR: 23న ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
-
Crime News
Teenmar Mallanna: కానిస్టేబుళ్లపై దాడి కేసు.. చర్లపల్లి జైలుకు తీన్మార్ మల్లన్న