Swara Bhaskar: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్వరా భాస్కర్‌..

బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ (Swara Bhasker) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌మీడియాలో ఫొటోలు షేర్‌ చేశారు.

Updated : 26 Sep 2023 10:54 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ (Swara Bhasker) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ  విషయాన్ని ఆమె భర్త ఫహద్‌ అహ్మద్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. సెప్టెంబర్‌ 23న కూతురు పుట్టినట్లు తెలిపారు. ఆమెకు రబియా అనే పేరు కూడా పెట్టినట్లు చెప్పారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. 

ప్రభాస్‌ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!

స్వరా భాస్కర్‌ ఈ ఏడాది జనవరిలో ముంబయికి చెందిన రాజకీయ నాయకుడు ఫహద్‌ అహ్మద్‌ను వివాహమాడారు. జూన్‌లో బేబిబంప్‌ ఫొటోలను షేర్‌ చేసి తల్లికానున్నట్లు తెలిపారు. తాజాగా బిడ్డ ఫొటోలను షేర్‌ చేసి ‘ ప్రార్థనలన్నీ ఫలించాయి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టం. అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.  ఇక 2009లో ఓ హిందీ చిత్రంతో స్వరా భాస్కర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గతేడాది రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. అలాగే ఆమె నటించిన మరో బాలీవుడ్‌ చిత్రం (Mrs Falani) డిసెంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని