Taapsee Pannu: రెండు పాత్రలూ ఆకట్టుకుంటాయి

‘పింక్‌’, ‘థప్పడ్‌’... వంటి మహిళా ప్రాధాన్య చిత్రాలతో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకుంది తాప్సి. ‘ఝమ్మంది నాదం’తో తొలి సారిగా తెలుగులో వెండి    తెరపై మెరిసిన ఈ దిల్లీ భామ... బాలీవుడ్‌లో మంచి విజయాలతో...

Updated : 15 Sep 2021 11:22 IST

‘పింక్‌’, ‘థప్పడ్‌’... వంటి మహిళా ప్రాధాన్య చిత్రాలతో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకుంది తాప్సి. ‘ఝమ్మంది నాదం’తో తొలి సారిగా తెలుగులో వెండి    తెరపై మెరిసిన ఈ దిల్లీ భామ... బాలీవుడ్‌లో మంచి విజయాలతో జోరుమీదుంది. తొలిసారిగా తాప్సి తమిళంలో నటించిన చిత్రం ‘అనబెల్‌ సేతుపతి’. విజయ్‌సేతుపతి కథానాయకుడు. పలువురు తమిళ, తెలుగు నటీనటులు ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 17 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఈ నేపథ్యంలో ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా మాట్లాడింది తాప్సి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

‘‘అనబెల్‌ సేతుపతి’ హారర్‌ చిత్రం కాదు... ఇదో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. నేనిందులో ద్విపాత్రాభినయం చేస్తున్నా. రెండు పాత్రలు భిన్నంగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటాయి. పురాతన, అధునాతన కాలాల్లో ఈ కథ సాగుతుంది. పూర్తిస్థాయి మహిళా ప్రాధాన్య చిత్రం కాకపోయినా... నా పాత్ర చాలా కీలకమైనది. కరోనా భయాలతో ఉంటున్న ప్రజలకు ఇది మంచి వినోదాన్ని ఇస్తుందని నమ్ముతున్నా.’’

‘‘ఎన్ని ఓటీటీలు వచ్చినా... థియేటర్లో సినిమా చూడటం అనే ఫీలింగే వేరు. అది ఎప్పటికీ అద్భుతమే. నా వరకూ నేను థియేటర్లలోనే బాగా ఎంజాయ్‌ చేస్తాను. ఇప్పుడు దేశమంతా పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి... తప్పక ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తోంది.’’

‘‘తెలుగు, తమిళం, హిందీ... ఇలా మూడు పరిశ్రమల్లో నటిస్తున్నా. నా మాతృభాష హిందీ కాబట్టి... ఇక్కడ భాష విషయంలో నాకు కొంచెం సౌలభ్యం ఉంటుంది. ఇక చిత్రీకరణ, సినిమాల విషయంలో ఎక్కడైనా ఒక్కటే. అన్ని పరిశ్రమల్లో బాగా కష్టపడి మంచి సినిమాలు చేస్తున్నారు.’’

‘‘పాత్ర పెద్దదా? చిన్నదా? దానికి ఎన్ని సన్నివేశాలుంటాయి? లాంటి విషయాలు అస్సలు ఆలోచించని వ్యక్తి విజయ్‌సేతుపతి. అతనితో తొలిసారి నటిస్తున్నా. అంత పెద్ద కథానాయకుడైనా... చాలా సింపుల్‌గా ఉంటారు. అందరితో కలివిడి ఉంటూ సెట్లో సందడి చేస్తుంటారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని