RRR Trailer: రాజమౌళి సర్‌.. మతిపోతోంది..!

రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం....

Published : 10 Dec 2021 01:32 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌పై ప్రముఖుల స్పందన

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ - తారక్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ (RRR Trailer)ని చిత్రబృందం విడుదల చేసింది. తారక్‌ - చరణ్‌ల పవర్‌ప్యాక్డ్‌ పెర్ఫార్మెన్స్‌లతో నిండిపోయిన ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు స్పందించారు. ట్రైలర్‌ అత్యద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.


🎬 రాజమౌళి సర్‌.. ట్రైలర్‌ చూస్తుంటే మతిపోతోంది. రామ్‌చరణ్‌, తారక్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఆలియా భట్‌తోపాటు మొత్తం చిత్రబృందానికి నా అభినందనలు

- కరణ్‌ జోహార్‌


🎬 అద్భుతమైన ఎలివేషన్స్‌, పవర్‌ఫుల్‌ పాత్రలు, మనసుని హత్తుకునే భావోద్వేగాలతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఈ మేజిక్‌ని వెండితెరపై చూసేందుకు ఆతృతగా ఉన్నా

- క్రిష్‌ 


🎬 ట్రైలర్‌ చూస్తే గర్వంగా ఉంది. వేరే లెవల్‌ ట్రైలర్‌ ఇది

- విజయ్‌ దేవరకొండ


🎬 ఎమోషన్‌, యాక్షన్‌ల పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ల స్క్రీన్‌ ప్రజెన్స్‌ అదరగొట్టేలా ఉంది. మా అంచనాలకు మించి ఈ సినిమా ట్రైలర్‌ ఉంది. మన దేశంలో పుట్టిన ఉత్తమమైన దర్శకుడు రాజమౌళి

- కోన వెంకట్‌


🎬 ఈ అద్భుతమైన విజువల్స్‌ చూశాక మాటలు రావడం లేదు..! అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో ప్రతిఒక్కరూ ఎంతలా శ్రమించారో ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తోంది. రాజమౌళికి అభినందనలు

- వెంకీ కుడుముల


🎬 అత్యద్భుతం.. మా ఊహలకు మించి ఈ ట్రైలర్‌ని రూపొందించారు. మన తారక్‌, చరణ్‌ అదరగొట్టేశారు. రాజమౌళి సర్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ విజన్‌

- అనిల్‌ రావిపూడి


🎬 టేక్‌ ఏ బౌ రాజమౌళి.. ట్రైలర్‌ అదిరిపోయింది

- గోపీచంద్‌ మలినేని


🎬 రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. ట్రైలర్‌ ఆద్యంతం సర్‌ప్రైజ్‌లతో నిండిపోయింది. భావోద్వేగాలు, ఎలివేషన్స్‌పై తనకున్న పట్టుని రాజమౌళి మరోసారి నిరూపించారు

- బాబీ


🎬 బిగ్గెస్ట్‌ గ్లోబల్‌ యాక్షన్‌ డ్రామా అనే టైటిల్‌ ఈ ట్రైలర్‌కి సరిగ్గా సెట్‌ అవుతుంది. అద్భుతమైన ప్రపంచం, పాత్రలు.. చూస్తుంటే మాటలు రావడం లేదు. చిత్రబృందానికి నా అభినందనలు

- మారుతి


🎬 ఇదొక అద్భుతం. రాజమౌళిగారు తన మరోసారి తన సత్తా చాటారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లుక్స్‌ అదిరిపోయాయి. మనమంతా గర్వించదగ్గ  చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. - నారా రోహిత్‌.


🎬 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వేరే లెవల్‌లో ఉంది.  ఆయుధాల్లాంటి ఇద్దరు హీరోలతో రాజమౌళి సృష్టించిన అద్భుతాన్ని వెండి తెరపై చూసేందుకు వేచి చూస్తున్నా. - నందమూరి కల్యాణ్‌రామ్‌.


🎬 కెప్టెన్‌ రాజమౌళి మీ పవర్‌ని చూపించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. - రానా దగ్గుబాటి.


🎬 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ మతిపోగొట్టింది. - వరుణ్‌తేజ్‌


🎬 మాటలు రావట్లేదు. నా అభిప్రాయాన్ని ఎలా తెలియజేయాలో అర్థంకావట్లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది.  - పూజాహెగ్డే.


🎬 ఎమోషన్స్‌లోనూ, యాక్షన్‌ సన్నివేశాల్లోనూ అద్భుతమైన పెర్ఫామెన్స్‌ కనిపించింది. రాజమౌళి సర్‌ మీరు ఇండియన్‌ సినిమాకి గర్వకారణం. -రాశీఖన్నా.


🎬 సింహాలే కాదు.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కూడా గర్జిస్తుంది. - సాయిమాధవ్‌ బుర్రా.


🎬 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ పిచ్చెక్కిస్తోంది.  - రష్మిక.


🎬 స్టార్లు కనపడటంలేదు. పాత్రలే కనపడుతున్నాయి.  చిత్రీకరణ అద్భుతం. - గోపీమోహన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని