Cannes: అంతా అయిపోయింది.. కానీ..!

సినీలోకం, ఫ్యాషన్‌ ప్రియులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌’ ముగింపు దశకు చేరుకుంది. పలు దేశాలకు చెందిన తారల హొయలొలికించే హంస నడకలతో వారంరోజులపాటు ఎర్రతివాచీ...

Updated : 17 Jul 2021 13:03 IST

వెలవెలబోయిన ఎర్ర తివాచీ

పారిస్‌: సినీలోకం, ఫ్యాషన్‌ ప్రియులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌’ ముగింపు దశకు చేరుకుంది. పలు దేశాలకు చెందిన తారల హొయలొలికించే హంస నడకలతో వారంరోజులపాటు ఎర్రతివాచీ మురిసిపోయింది. శనివారం ఈ కేన్స్‌ ఉత్సవం ముగింపు సంబరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కేన్స్ ఫెస్టివల్‌ పట్ల పలువురు ఫ్యాషన్‌ ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఎర్రతివాచీపై సందడి చేసే మన భారతీయ అందాలు ఈసారి కనిపించకపోవడమే అందుకు కారణం..

ఈ ఏడాది కేన్స్‌ వేడుకల్లో పాల్గొన్న అమీజాక్సన్‌

‘దేవదాస్‌’ సినిమా ప్రిమియర్‌లో భాగంగా మన అందాల తార ఐశ్వర్యరాయ్‌ 2002లో మొట్టమొదటిసారి కేన్స్‌లోకి అడుగుపెట్టారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో ఎర్రతివాచీపై ఆమె హొయలొలికించారు. అప్పటి నుంచి సుమారు 15 సార్లు ఆమె కేన్స్‌ ఉత్సవంలో పాల్గొని.. తన అందంతో అందర్నీ కట్టిపడేశారు. ఐష్‌ మాత్రమే కాకుండా బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు విద్యాబాలన్‌, సోనమ్‌కపూర్‌, దీపికాపదుకొణె, కంగనా రనౌత్‌.. ఇప్పటివరకూ జరిగిన కేన్స్‌ ఉత్సవాల్లో ఎన్నోసార్లు తమ సొగసులతో అందరి చూపుల్ని తమవైపునకు తిప్పుకున్నవాళ్లే. అయితే, కరోనా కారణంగా సినిమా రిలీజ్‌లు లేకపోవడంతో ఈ ఏడాది జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు అమిజాక్సన్‌ మినహాయించి మన తారలు ఎవరూ హాజరు కాలేదు. దీంతో పలువురు నెటిజన్లు.. ‘అంతా ఐపాయే.. కానీ అందాలు కనిపించలేదే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన తారల కేన్స్‌ తళుకులపై ఓ లుక్కేద్దాం..!

ఐష్‌

ఐష్‌

దీపికా పదుకొణె

దీపికా పదుకొణె

సోనమ్‌ కపూర్‌

కత్రినాకైఫ్‌

కంగనారనౌత్‌

ప్రియాంక చోప్రా

విద్యాబాలన్‌

మల్లికా శెరావత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని