RRR: చరణ్‌ పానీపూరి.. ఆలియా బన్‌ మస్కా... మరి జక్కన్న?

ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ నటి సాహెబాకు హైదరాబాదీ బిర్యానీతోపాటు పలు పసందైన వంటకాల్ని రుచి చూపించారు.

Published : 06 Jan 2022 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు జూనియర్‌ ఎన్టీఆర్‌.. బాలీవుడ్‌ నటి సాహెబా బాలీకి హైదరాబాదీ బిర్యానీతోపాటు పలు పసందైన వంటకాల్ని రుచి చూపించారు. రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్‌ నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా సాహెబా.. ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో సాహెబాను అతిథిగా భావించిన ఎన్టీఆర్‌ ఆమెకు హైదరాబాదీ బిర్యానీ, తెలంగాణ చేపల పులుసు, గుంటూరు చికెన్‌ను వడ్డించారు. వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం, ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో మీరు నిజమైన పులితో ఫైట్‌ చేశారట నిజమేనా?’ అని సాహెబా ప్రశ్నించగా ‘ఏమో.. అయిండొచ్చు, కాకపోవచ్చు’ అంటూ తారక్‌ సమాధానం చెప్పకుండా కన్ఫ్యూజ్‌ చేశారు.

‘మీకు ఎన్ని భాషలు వచ్చు’ అనే ప్రశ్నకు ‘తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌’ అని ఎన్టీఆర్‌ చెప్పారు. పీరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. జనవరి 7న విడుదలకావాల్సి ఉండగా ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కి తారక్‌ సెలెక్ట్‌ చేసిన వంటలివీ..

రాజమౌళి: బిర్యానీ చూడటానికి సింపుల్‌గా ఉంటుంది కానీ వండాలంటే మాత్రం చాలా కష్టపడాలి. దీన్ని తయారు చేయాలంటే అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. రాజమౌళి కూడా అంతే, చూడటానికి సింపుల్‌ ఉంటారు కానీ పని విషయంలో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటారు.

రామ్‌చరణ్‌: పానిపూరిని నోట్లో వేసుకోగానే దాని ఫ్లేవర్స్‌ బయపడతాయి. చరణ్‌ కూడా అంతే. తనతో మాట కలిపితే చాలు అన్ని విషయాలూ పంచుకుంటాడు.

ఆలియా భట్‌: ఇరానీ బన్‌ మస్కా ఎంతో ఆరోగ్యకరమైంది. చాలా ప్రత్యేకమైంది ఆలియా భట్‌. అందుకే ఆమె  ఇరానీ బన్‌ మస్కా లాంటిది. 

అజయ్‌ దేవ్‌గణ్‌: వడా పావ్‌.. ముంబయి లోకల్‌ ఫుడ్‌. అక్కడివారికి ఇది కచ్చితంగా ఉండాల్సిందే. వడా పావ్‌లా అజయ్‌ దేవ్‌గణ్‌ అందరికీ కావాల్సినవారు. 

Read Latest Telugu News and Cinema News here.

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని