Maanaadu movie Review: రివ్యూ: మానాడు
Maanaadu movie Review: శింబు, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటించిన ‘మానాడు’ ఎలా ఉందంటే?
చిత్రం: మానాడు; నటీనటులు: శింబు, ఎస్.జె.సూర్య, కల్యాణి ప్రియదర్శన్, ఎస్.ఎ.చంద్రశేఖర్; సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్; ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్; సంగీతం: యువన్ శంకర్ రాజా; నిర్మాత: సురేశ్ కామాట్చి; రచన, దర్శకత్వం: వెంకట్ ప్రభు; విడుదల: సోనీ లివ్ ఓటీటీ
‘మన్మధ’, ‘వల్లభ’ వంటి ప్రేమకథా చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు. ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం ‘మానాడు’. తెలుగులో ‘ది లూప్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే, కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. మరి ఇందులో శింబు పాత్ర ఏంటి? ఆయన ఎందుకు లూప్‌లో ఇరుక్కుపోయాడు? దాని నుంచి బయట పడటానికి ఆయన చేసిన సాహసం ఏంటి?(Maanaadu Movie review)
కథేంటంటే: అబ్దుల్ ఖాలిక్(శింబు)(simbu) ఎన్నారై. స్నేహితుడు ఈశ్వర మూర్తి(అమరన్) ప్రేమించిన జరీనా(అంజినా కీర్తి)కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు. విమాన ప్రయాణంలో అతడికి సీతామహాలక్ష్మి(కల్యాణి ప్రియదర్శన్) పరిచయమవుతుంది. ఇద్దరూ కలిసి ఒకే పెళ్లికి వెళతారు. మగపెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికుమార్తె జరీనాను అక్కడి నుంచి తీసుకెళ్తాడు. రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో సడెన్‌గా ఖాలిక్ నడుపుతున్న కారు కింద పడి రఫీక్(డేనియల్) చనిపోతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్కోటి(ఎస్జే సూర్య)(SJ Suryah) ఖాలిక్‌ను బెదిరించి సీఎం(ఎస్ఏ చంద్రశేఖర్)ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు. మరి ఖాలిక్ సీఎంను చంపాడా? అసలు సీఎంను చంపడానికి కారణం ఎవరు? దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏంటి? ఆ కుట్రను అబ్దుల్ ఖాలిక్ ఎలా ఛేదించాడు?
ఎలా ఉందంటే: కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి కథలు కొత్తేమీ కాదు. అయితే, కాలం అనే కాన్సెప్ట్‌ను ఎవరు? ఎలా ఉపయోగించుకుని ఆసక్తికరంగా మలిచారన్నదానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ‘ఆదిత్య 369’, ‘టెనెట్’, ‘కుడి ఎడమైతే’, ‘24’ ఇవన్నీ కాలంతో ముడిపడిన సినిమాలే. అలాంటి కాలం కథతో వెంకట్ ప్రభు తీసిన చిత్రమే ‘మానాడు’. ‘టైమ్ లూప్’ అనే కాన్సెప్ట్‌ను తీసుకుని తికమక లేకుండా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసేలా ‘మానాడు’ను తీర్చిదిద్దడంలో దర్శకుడు వెంకట్ ప్రభు సఫలమయ్యారు. ఖాలిక్ దుబాయ్ నుంచి రావడంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఖాలిక్ యాక్సిడెంట్ చేయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. డీసీపీ ధనుష్కోటి.. ఖాలిక్‌ను బెదిరించి సీఎంను చంపించడం.. ఆ తర్వాత ఉగ్రవాది పేరుతో ఖాలిక్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపడంతో టైమ్ లూప్ మొదలవుతుంది.
తాను టైమ్ లూప్‌లో చిక్కుకున్నానని తెలియడానికి ఖాలిక్‌కు పెద్దగా సమయం ఏమీ పట్టదు. ఖాలిక్ మాత్రమే టైమ్ లూప్‌లో ఇరుక్కుపోవడానికి దర్శకుడు చెప్పిన లాజిక్, అందుకు నేపథ్యం బాగుంది. దేశంలో ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడల్లా ఒక వర్గం ప్రజలు ఎలాంటి నిందారోపణకు గురవుతున్నారన్న విషయాన్ని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. కథానాయకుడిని పాత్రను అబ్దుల్ ఖాలిక్‌గా చూపించడం వెనుకా కారణం అదే! తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు కుల, మత ఘర్షణలు ఎలా సృష్టిస్తారన్న విషయాన్ని చూపించే ప్రయత్నం చేశారు. సీఎంను కాపాడేందుకు ఖాలిక్ ప్రయత్నాలు చేయడం, ధనుష్కోటి మరొక ప్రయత్నంతో వాటిని విఫలం చేయడం. ఇలా టైమ్‌లూప్ రన్ అవుతూ ఉంటుంది. అసలు దీనికి మూలం ఎక్కడనేది తెలుసుకునేందుకు ప్రయత్నం మొదలు పెట్టిన తర్వాత ఖాలిక్‌కు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అయితే, డీసీపీ ధనుష్కోటి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రతిసారీ ఖాలిక్ చనిపోతుంటాడు. దీంతో మళ్లీ కథ మొదటికి వస్తుంది. ఇలా సాదాసీదాగా వెళ్లిపోతే అది వెంకట్ ప్రభు సినిమా ఎందుకవుతుంది? ఖాలిక్తో పాటు ధనుష్కోటి కూడా టైమ్‌లూప్‌లో ఇరుక్కుపోయేలా ఇచ్చిన ట్విస్ట్ అదుర్స్. అది ఎలా అన్నది మాత్రం తెరపై చూడాల్సిందే. ఇద్దరూ టైమ్ లూప్‌లో ఇరుక్కుపోయాక వచ్చే సన్నివేశాలు నువ్వా-నేనా అన్నట్లు సాగుతాయి. సీఎం చనిపోకుండా కాపాడేందుకు ఖాలిక్ ప్రయత్నాలు చేయడం, ఈ విషయం ముందే తెలిసిన ధనుష్కోటి ఎత్తుకు పై ఎత్తు వేయడంతో చివరి వరకూ సినిమా ఉత్కంఠతో సాగుతుంది. ఈ క్రమంలో ధనుష్కోటిగా ఎస్జే సూర్య పలికే సంభాషణలు, హావభావాలు ప్రేక్షకులను అసలైన వినోదాన్ని పంచుతాయి. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. దీనికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెబుతాడు.
ఎవరెలా చేశారంటే: అబ్దుల్ ఖాలిక్ పాత్రలో శింబు అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ఆయన ఖాతాలో మంచి హిట్ పడింది. తెరపై పూర్తి ఎనర్జీతో కనిపించాడు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర డీసీపీ ధనుష్కోటి. ఎస్జే సూర్య ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన పలికే సంభాషణలు, హావభావాలు మెప్పిస్తాయి. ఖాలిక్-ధనుష్కోటి ఎదురుపడే సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. రిచర్డ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ బాగున్నాయి. యువన్ శంకర్‌రాజా నేపథ్య సంగీతం సినిమాలో ప్రేక్షకుడిని లీనం చేస్తుంది. దర్శకుడు వెంకట్ ప్రభు ఎంచుకున్న టైమ్ లూప్ సబ్జెక్ట్ కాస్త క్లిష్టమైనదే. కానీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా సన్నివేశాలను రాసుకున్న విధానం, వాటిని తెరకెక్కించిన తీరు బాగుంది. ఒక వ్యక్తి జీవితంలో అదీ ఒక రోజులో జరిగిన సంఘటనలు మళ్లీ మళ్లీ జరగడం తెరపై చూపిస్తే, ప్రేక్షకుడికి విసుగువస్తుంది. కానీ, అలాంటి ఆలోచనే రాకుండా వెంకట్ ప్రభు కథనంతో మేజిక్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ చిత్రాలను ఇష్టపడేవారికి ‘మానాడు’ విపరీతంగా నచ్చుతుంది. మధ్య మధ్యలో వదలిపెట్టకుండా మొదటి నుంచి చివరి వరకూ సినిమా చూస్తే, సాధారణ ప్రేక్షకుడూ ఎలాంటి తికమకలేకుండా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. తమిళంతో పాటు, తెలుగులోనూ ‘సోనీ లివ్’ ఓటీటీలో అందుబాటులో ఉందీ చిత్రం.
బలాలు
+ శింబు, ఎస్జే సూర్యల నటన
+ కథ, కథనం
+ దర్శకత్వం
బలహీనతలు
- ఆరంభ సన్నివేశాలు
చివరిగా: ‘మానాడు’ వాళ్లు టైమ్‌లూప్‌లో ఇరుక్కుంటారు.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?