RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కొత్త పేరు.. రాజమౌళి, తారక్‌, చరణ్‌ నవ్వులే నవ్వులు

న్నార‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి కొత్త పేరుని సూచించి వ్యాఖ్యాత, హాస్య నటుడు కపిల్‌శర్మ నవ్వులు కురిపించారు.

Updated : 27 Dec 2022 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర టైటిల్‌కు కొత్త అర్థం చెప్పి వ్యాఖ్యాత, హాస్య నటుడు కపిల్‌శర్మ నవ్వులు కురిపించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ రాజమౌళి, రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, ఆలియాభట్‌తో కలిసి సందడి చేశారు. ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ది కపిల్‌ శర్మ షో’కి వీరంతా అతిథులుగా విచ్చేశారు. ఈ క్రమంలో కపిల్‌ నాన్‌స్టాప్‌గా నవ్వించారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌తో ఫొటో దిగిన అనంతరం, ‘మీకు ఎయిర్‌లైన్స్‌, హాస్పిటల్స్‌, హోటల్స్‌ ఇతర వ్యాపారాలుండగా ఇంకా ఎందుకు సినిమాల్లో నటిస్తున్నారు’ అంటూ కపిల్‌ ప్రశ్నించగా ‘ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఉన్నా ఈ షోకి వచ్చే అవకాశం ఉండదు కదా’ అని రామ్‌ చరణ్‌ సరదా సమాధానమిచ్చారు. ‘రాజమౌళి సర్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే రూపాయి, రూపాయి, రూపాయి కదా’ అని చమత్కరించారు. ఒకటా రెండా ఇలా కపిల్‌ అడిగిన కొంటె ప్రశ్నలన్నింటికీ రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌, ఆలియా నవ్వుతూనే ఉన్నారు. అనంతరం, ఇదే వేదికపై ఆలియా ఓ హిందీ గీతానికి, చరణ్‌- తారక్‌ ‘నాటునాటు’ పాటకు స్టెప్పులేసి అలరించారు.

డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్‌ ఇండియా సినిమా 2022 జనవరి 7న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను అన్ని భాషల్లోనూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. అలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఈ షోలో పాల్గొంది. రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే ‘రౌద్రం రణం రుధిరం- ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌ నటించారు. శ్రియ, అజయ్‌దేవ్‌గణ్‌, సముద్రఖని తదిరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని