Shyam Singha Roy: నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. తెర వెనక కష్టం చూశారా..!

‘శ్యామ్‌ సింగరాయ్‌’ మేకింగ్‌ వీడియో. నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కించిన చిత్రమిది...

Published : 23 Dec 2021 21:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేక్షకులు తెరపై మూడు గంటల సినిమా చూసి వినోదం పొందాలంటే తెర వెనక ఎంతోమంది కష్టపడాలి. పీరియాడికల్‌ నేపథ్యమున్న చిత్రాలైతే ఆ శ్రమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాలంటే సెట్స్‌, నటుల ఆహార్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కోసం దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ ఇదే స్థాయిలో శ్రమించారు. నాని హీరోగా ఆయన రూపొందించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘మేకింగ్‌ వీడియో’ విడుదలైంది. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ, సెట్స్‌ను తీర్చిదిద్దిన తీరును ఇందులో చూడొచ్చు. అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేందుకు దర్శకుడు, నటులు, సాంకేతిక బృందం ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించారు. .

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు