
హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నసమంత.. జడతో భయపెడుతున్న అషూ
* తన సహాయకురాలు గీతను తొలిసారిగా విమానంలో తీసుకెళ్లింది నటి, యాంకర్ కనకాల సుమ. ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కిన వీడియోను షేర్ చేసింది.
* ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్ సంఖ్య 50 మిలియన్లకు చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేసింది నటి సన్నీ లియోనీ. ఫాలోవర్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
* హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది సమంత. స్విట్జర్లాండ్‌లో స్కీయింగ్ చేస్తూ దిగిన ఫొటోను షేర్ చేసింది.
* జడతో భయపెట్టడం అంటే ఇదేనేమో.. అంటోంది అషూ రెడ్డి. నలుపు రంగు దుస్తుల్లో విచిత్రమైన హెయిర్‌స్టైల్‌తో దిగిన ఫొటోను షేర్ చేసింది.
* ఈ రోజుల్లో ప్రతిదానికీ నేనిచ్చే హావభావాలు ఇలాగే ఉంటాయి అంటూ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది నటి లావణ్య త్రిపాఠి.
* మీరు ఎప్పుడైనా ఎడారికి వెళ్లారా? అని అడుగుతోంది నటి వేదిక. ఎడారిలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఆమె పోస్టు చేసింది.
* తన ఫొటో ఉన్న ఫిల్మ్‌ఫేర్ కవర్ పేజీని షేర్ చేశారు బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉన్నారు. ఇలా సినీతారలు పంచుకున్న సోషల్‌మీడియా పోస్టులు మీకోసం