Radheshyam: దానికినేను మ్యూజిక్‌ ఇవ్వలేదు: తమన్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ‘రాధేశ్యామ్‌’ ప్రీరిలీజ్...

Published : 23 Dec 2021 21:39 IST

హైదరాబాద్: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ‘రాధేశ్యామ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. ఈవెంట్‌లో భాగంగా అభిమానుల చేతుల మీదుగా ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమా థియరేటికల్‌ ట్రైలర్‌కు చిత్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రభాకరన్‌ కాకుండా తమన్‌ ప్రత్యేకంగా మ్యూజిక్‌ అందించారని గత కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలపై తాజాగా తమన్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని.. రాధేశ్యామ్‌ ట్రైలర్‌కు తాను వర్క్‌ చేయలేదని అన్నారు. పాన్‌ ఇండియా సినిమాగా రానున్న ఈ సినిమా కోసం ఇద్దరు సంగీత దర్శకులు పనిచేశారు. దక్షిణాది భాషలకు జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందించగా.. హిందీ వెర్షన్‌కు మిథున్, అమాల్‌ మల్లిక్‌ సంగీతం అందించారు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని