Tollywood: వెంకటేశ్‌ బర్త్‌డే ‘ఎఫ్‌3’ స్పెషల్ వీడియో.. ‘హనుమాన్‌’లో కథానాయిక ఈమే!

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్3’.

Published : 13 Dec 2021 16:08 IST

హైదరాబాద్‌: వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్3’. సోమవారం వెంకటేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో నవాబు వేషంలో ఉన్న వెంకటేశ్‌ చార్మినార్‌ ముందు చిరునవ్వులు చిందిస్తూ 2వేల నోట్లతో విసురుకుంటూ కూర్చొన్నారు. ‘ఎఫ్‌2’లో భార్యభర్తల మధ్య జరిగే చిన్న గొడవలు చూపిస్తూ నవ్వులు పంచారు అనిల్‌ రావిపూడి. ఇప్పుడు డబ్బు నేపథ్యంలో భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు వస్తాయన్న దానికి తనదైన కామెడీ టైమింగ్‌ జోడించి చూపించనున్నారు.


‘హనుమాన్‌’లో కథానాయిక అమృత

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హనుమాన్‌’. పాన్‌ ఇండియా సూపర్‌హీరో ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రను చిత్ర బృందం విడుదల చేసింది. అమృత అయ్యర్‌ ఇందులో మీనాక్షి అనే పాత్రను పోషిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది.


శ్యామ్‌ సింగరాయ్‌ ట్రైలర్‌కు సర్వం సిద్ధం

నాని, సాయి పల్లవి, కృతిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకుడు. మంగళవారం ‘రాయల్‌ ఈవెంట్‌’ పేరుతో వరంగల్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని