The Vaccine War Ott: ఓటీటీలో ‘ది వ్యాక్సిన్‌ వార్’ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

వివేక్‌ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది వ్యాక్సిన్‌ వార్’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది

Published : 23 Nov 2023 16:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన మరో ఆసక్తికర చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War). ఈ ఏడాది సెప్టెంబరు 28 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితైంది. అనుపమ్‌ ఖేర్‌, నానా పటేకర్‌, పల్లవి జోషి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. భారతీయ శాస్త్రవేత్తల నిజమైన కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  కొవిడ్‌ మహమ్మారి సమయంలో దానిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు ఎలా అభివృద్ధి చేశారనేది ఈ చిత్రంలో చూపించారు. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా నవంబరు 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ప్రస్తుతం హిందీలోనే ఇది అందుబాటులో ఉంటుందని డిస్నీ+హాట్‌స్టార్‌ తెలిపింది. మరి ఇతర భారతీయ భాషల్లోనూ ‘ది వ్యాక్సిన్‌ వార్’ అందిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు