Telugu movies 2023: ఈ వారం థియేటర్‌ /ఓటీటీలో అలరించే చిత్రాలివే!

Telugu movies 2023: సెప్టెంబరులో పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో వారం అలరించే చిత్రాలు వస్తున్నాయి. ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌ మూవీలు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.

Updated : 04 Sep 2023 10:39 IST

‘పఠాన్‌’తో మెప్పించాడు.. ‘జవాన్‌ ’గా వస్తున్నాడు

ప్రముఖ కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జవాన్‌’. అట్లీ దర్శకుడు. నయనతార కథానాయికగా నటిస్తోంది. బ్లాక్‌బస్టర్‌ ‘పఠాన్‌’ తర్వాత షారుక్‌ నుంచి వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ప్రియమణి, సన్యా మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబరు 7న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.


చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను పలకరించబోతున్న అనుష్క

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహించారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. సెప్టెంబరు 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్‌ పొలిశెట్టి ఇందులో స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలో నటిస్తుండగా, అనుష్క చెఫ్‌గా కనిపిస్తారు. అభినవ్‌ గోమటం, మురళీశర్మ, తులసి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.


ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే!

థియేటర్‌లో అలరించి..

ఇటీవల విడుదలై రికార్డులు సృష్టించిన సినిమా ‘జైలర్‌’ (Jailer). నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూశారు. ఆగస్టు 10న రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video) వేదికగా సెప్టెంబర్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వస్తోంది. ఇక ‘జైలర్‌’ ఇప్పటి వరకూ రూ.600కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. 


ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నవాజుద్దీన్‌..

ట్రాన్స్‌జెండర్‌ పాత్రతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నారు విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui). ఆయన కీలక పాత్రలో అక్షత్‌ అజయ్‌ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హడ్డీ’ (Haddi) ఇందులో నవాజుద్దీన్‌.. అమ్మాయిగా మారాలనుకునే హరి అనే పాత్రలో నటిస్తున్నారు. మరి హరి అమ్మాయిగా మారడానికి కారణం ఏంటి? తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ క్రమంలో హరి ఏం పోగొట్టుకున్నాడు? అతనికి జరిగిన అన్యాయ్యానికి ఎలా పగతీర్చుకున్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


  • నెట్‌ఫ్లిక్స్‌
  • షేన్‌ గిల్లీస్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 5
  • స్కాట్స్‌ హానర్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 5
  • కుంగ్‌ఫూ పాండా (వెబ్‌సిరీస్‌3) సెప్టెంబరు 7
  • టాప్‌ బాయ్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 7
  • సెల్లింగ్‌ ది ఓసీ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 8
  • వర్జిన్‌ రివర్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 7
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • వన్‌ షాట్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 5
  • లక్కీ గౌ (హిందీ) సెప్టెంబరు 6
  • సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌(హాలీవుడ్) సెప్టెంబరు 8
  • డిస్నీ+హాట్‌స్టార్‌ 
  • ఐ యామ్‌ గ్రూట్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 6
  • ఆహా
  • లవ్‌ (తమిళ చిత్రం) సెప్టెంబరు 8
  • బుక్‌ మై షో
  • లవ్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8
  • లయన్స్‌ గేట్‌ ప్లే
  • ది బ్లాక్‌ డెమన్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8
  • ఆపిల్‌ టీవీ ప్లస్‌
  • ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8
  • హైరిచ్‌
  • ఉరు (మలయాళం) సెప్టెంబరు 4
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని