VarunTej-Lavanya: వేడుకగా వరుణ్‌ తేజ్‌ - లావణ్య నిశ్చితార్థం.. మెగా, అల్లు హీరోల సందడి

నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej)  నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థం వేడుకగా జరిగింది.

Updated : 10 Jun 2023 16:38 IST

హైదరాబాద్‌: రీల్‌ కపుల్‌ వరుణ్‌ తేజ్‌ (VarunTej) - లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) రియల్‌ కపుల్‌ కానున్నారు. త్వరలో వీరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వరుణ్‌తేజ్‌ - లావణ్య ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా సోషల్‌మీడియాలో #VarunLav హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

2017లో విడుదలైన ‘మిస్టర్‌’ కోసం వరుణ్‌ - లావణ్య తొలిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏడాదిలోనే వీరి కాంబినేషన్‌లో ‘అంతరిక్షం’ వచ్చింది. ఈ క్రమంలోనే వీరి స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

ఇక, వరుణ్‌ తేజ్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గాండీవధారి అర్జున’ చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత వరుణ్‌.. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌, కరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. మరోవైపు, లావణ్య ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అధర్వ హీరోగా ఇది తెరకెక్కుతోంది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఓ సినిమాలో అలాగే, అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై రానున్న ఓ వెబ్‌సిరీస్‌లోనూ ఆమె నటించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని