Simbu: శింబు కొత్త చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

శింబు హీరోగా దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కించిన ‘వెందు తనిందతు కాడు’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ఆ వివరాలివీ..

Published : 12 Oct 2022 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శింబు (Simbu) హీరోగా దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ (Gautham Menon) తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వెందు తనిందతు కాడు’ (Vendhu Thanindhathu Kaadu). తెలుగులో ‘ది లైఫ్‌ ముత్తు’ (The Life Of Muthu) పేరుతో ఇటీవల విడుదలై, ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబరు 13 నుంచి ఈ సినిమా ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ కానుంది. సోషల్‌ మీడియా వేదికగా విడుదల తేదీని ప్రకటించిన సదరు సంస్థ తెలుగు వెర్షన్‌పై స్పష్టతనివ్వలేదు. సిద్ధి ఇద్నాని కథానాయికగా మెరిసిన ఈ చిత్రంలో రాధిక కీలక పాత్రతో మెప్పించారు. ఏ దిక్కూలేని వ్యక్తి జీవితంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు? వాటిని అధిగమించి ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. త్వరలో ఈ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని