Venkaiah Naidu: ఇది సందేశాత్మక చిత్రం: నటుడు ఆర్కే సాగర్‌కు వెంకయ్య నాయుడి ప్రశంస

వెంకయ్య నాయుడు ‘ది 100’ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసి, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Published : 14 Mar 2024 23:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను ‘ది 100’ (The 100) సినిమా ప్రివ్యూ చూశానని, ఇతివృత్తం బాగుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ఆ చిత్రం ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్కే సాగర్‌ (RK Sagar) హీరోగా దర్శకుడు రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ రూపొందించిన మూవీ ఇది. పోలీసు అధికారిగా సాగర్‌ నటించారు.

వేడుకనుద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘‘సినిమా శక్తిమంతమైన ఆయుధం. రాజకీయం, సాహిత్యం తర్వాత నాకు సినిమా ఇష్టం. ఇదొక విస్తృత ప్రచార సాధనం. కోట్లాదిమంది తక్కువ ఖర్చుతో చూడదగ్గది సినిమా. ఇది ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే నేను అప్పుడప్పుడు సినిమా వేడుకల్లో పాల్గొని, నా అభిప్రాయం వ్యక్తం చేస్తుంటా. ‘ది 100’ చిత్రం ప్రివ్యూ చూశా. ఇతివృత్తం బాగుంది. సందేశాత్మక చిత్రమిది. అసభ్యతకు తావులేని ఈ మూవీ విజయంతమవుతుందనే నమ్మకం నాకుంది. సాగర్‌ తక్కువ సమయంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా చూశాక పోలీసు అధికారి సాగర్‌లా ఉండాలనే అభిప్రాయం అందరికీ కలుగుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమా వెంకయ్య నాయుడికి చూపించి, ఆయన అభిప్రాయం పొందాలనేది నా కల. అది నెరవేరినందుకు గర్వంగా ఉంది. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా రూపొందించాం’’ అని సాగర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని