Vicky Kaushal: ఆ సినిమా విడుదల టెస్ట్‌ మ్యాచ్ అవుతుందని ముందే తెలుసు: విక్కీకౌశల్‌

బాలీవుడ్‌ నటుడు విక్కీకౌశల్‌ తన సినిమా ‘సామ్‌ బహదూర్‌’ బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొన్న పోటీ గురించి మాట్లాడారు.

Published : 17 Mar 2024 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ నటుడు విక్కీకౌశల్‌ (Vicky Kaushal). గతేడాది విడుదలైన ‘సామ్‌ బహదూర్‌’ (Sam Bahadur) చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. భారతదేశ మొదటి ఫీల్డ్‌ మార్షల్ సామ్‌ మానెక్‌షా జీవితం ఆధారంగా మేఘనా గుల్జార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబరు 1న విడుదలైంది. అదే సమయంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటించిన  ‘యానిమల్‌’ (Animal) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్‌ రెడ్డి వంగా రూపొందించిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.

విక్కీకౌశల్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం  గురించి మాట్లాడారు. ‘‘వేర్వేరు నేపథ్యాల మధ్య ఈ రెండు సినిమాలను రూపొందించారు. ఇవి ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సినిమాల రిలీజ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ అవుతుందని మాకు ముందే తెలుసు. ‘యానిమల్‌ బాక్సాఫీస్‌ హిట్‌ అందుకుంటుందని ఒకరు రిలీజ్‌కు ముందే ఊహించారు. తర్వాత ఆ సినిమా కలెక్షన్స్‌ చూసి షాక్‌ అయ్యాను. సినిమాలు విజయం సాధించాలంటే ప్రేక్షకుల ఆదరణ అవసరం’’ అని విక్కీకౌశల్‌ వెల్లడించారు.  ప్రస్తుతం విక్కీ కౌశల్‌ ‘ఛావా’ చిత్రంలో నటిస్తున్నారు. లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో రష్మిక కథానాయిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని