Vaarasudu Review: రివ్యూ: వారసుడు
Vaarasudu Review: విజయ్ (Vijay), రష్మిక మందన (Rashmika Mandanna) కీలక పాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘వారసుడు’ (Vaarasudu) ఎలా ఉందంటే?
Vaarasudu Review; చిత్రం: వారసుడు; నటీనటులు: విజయ్, రష్మిక, శరత్ కుమార్, ప్రభు, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, జయసుధ, ఖుష్బూ, యోగిబాబు తదితరులు; సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: కార్తిక్ పళని; ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్.; రచన: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్; నిర్మాత: దిల్ రాజు; దర్శకత్వం: వంశీ పైడిపల్లి; విడుదల: 14-01-2023 (Vaarasudu Review)
2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) కూడా వచ్చేశాడు. ఆయన కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘వారసుడు’. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల చేయాలనుకున్నారు. తమిళ చిత్రం యథావిధిగా 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు వెర్షన్‌ను శనివారం విడుదల చేశారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ‘వారసుడు’ ఎలా ఉంది? విజయ్ పాత్ర ఏంటి? సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించింది?
కథేంటి?
మైనింగ్ రంగంలో తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగిన రాజేంద్ర (శరత్ కుమార్)కు ముగ్గురు కుమారులు. జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్). అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రాజేంద్ర తన సంస్థకు వారసుడిని ప్రకటించాలనుకుంటాడు. అప్పుడే విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చిన విజయ్‌ని ఓ ఫంక్షన్‌లో పరిచయం చేస్తాడు. అలాగే తగిన ప్రతిభను చాటుకున్న కుమారుడినే తన వ్యాపార వారసుడిగా ప్రకటిస్తానని చెబుతాడు. అయితే ఆ రేసు ఇష్టం లేని విజయ్.. తండ్రి మాటలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు. తల్లి సుధ (జయసుధ) అడ్డుకున్నప్పటికీ, కుటుంబం నుంచి విడిపోయి, ఏడేళ్లపాటు ఒంటరిగా ఉంటూ, ఓ స్టార్టప్ కంపెనీని ఆరంభిస్తాడు. (Vijay Vaarasudu Review)
ఇంతలో రాజేంద్ర, అతని సామ్రాజ్యాన్ని మట్టికరిపించడానికి ప్రతినాయకుడు జయప్రకాశ్ (ప్రకాశ్‌రాజ్) కుతంత్రాలు పన్నుతాడు. కుటుంబమంతా ఏకం కావాలంటే ఇంట్లో షష్టిపూర్తి నిర్వహిస్తే బాగుంటుందని సుధ అనుకుంటుంది. ఈ క్రమంలో రాజేంద్రకు ఓ దారుణమైన విషయం తెలుస్తుంది. వెంటనే, షష్టిపూర్తి కార్యక్రమానికి అంగీకరిస్తాడు. ఏడేళ్ల తర్వాత విజయ్ మళ్లీ ఇంటికి తిరిగొస్తాడు. కోలాహలంగా షష్టిపూర్తి జరుగుతున్న తరుణంలో.. అనూహ్యమైన పరిణామాలు ఎదురై ఆ కార్యక్రమం ఆగిపోతుంది. ఇద్దరు పెద్ద కుమారుల బాగోతం బయటపడుతుంది. దీంతో మళ్లీ ఆ ఇంటిని విడిచి వెళ్లాలనుకున్న విజయ్‌కి డాక్టర్ ఆనంద్ (ప్రభు) ద్వారా అసలు విషయం తెలిసి, మళ్లీ ఇంటికొస్తాడు. ఇంతలో మూడు ముక్కలైన ఆ కుటుంబం మళ్లీ కలిసిందా? విజయ్ తిరిగి రావడానికి కారణమేంటి? రాజేంద్ర వ్యాపార సామ్రాజ్యం ఏమైంది? విజయ్ తీసుకున్న నిర్ణయాలేంటి అన్నదే మిగిలిన కథ. (Vaarasudu Review)
ఎలా ఉంది?
ఓ తండ్రి, ముగ్గురు కుమారులు, తండ్రి ఆశయాలకు అడ్డుపడే విలన్, ఆ తండ్రిని పట్టించుకోకుండా స్వార్థంతో వెళ్లిపోయే అన్నదమ్ములు, వారిని కలిపేందుకు.. విలన్‌ను మట్టికరిపించేందుకు కథానాయకుడు చేసే ప్రయత్నాలు.. ఇవన్నీ తెలుగు సినిమాకు కొత్తేమీ కావు. మూసధోరణిలోని ఈ కథనే వంశీ పైడిపల్లి ఎంచుకోవడం... దానికి విజయ్ అంగీకరించడం గమనార్హం. తొలిభాగం పూర్తిగా... హీరోను అతని కుటుంబ సభ్యులు విసుక్కోవడం, చిన్నచూపు చూడటం.. మలి భాగంలో ఒక్కొక్కరిగా అతన్ని ప్రేమించడం వంటి సన్నివేశాలు ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అయితే విజయ్‌ని ఈ సన్నివేశాల్లో చూడటం కొత్తగా ఉంది. మేకింగ్ విషయంలో గ్రాండియర్‌గా ఉంది. కానీ, సగటు ప్రేక్షకుడికి అవన్నీ సంతృప్తిపరుస్తాయా అన్నది సందేహమే. (Vijay - Rashmika Vaarasudu Review)
కథనం విషయానికొస్తే... రొటీన్ విలనిజం, తర్వాతి సన్నివేశంలో కథానాయకుడు ఎలా పావులు కదుపుతాడో ఇట్టే చెప్పేయొచ్చు. ఫస్టాఫ్‌లో నాలుగు, సెకెండాఫ్‌లో మూడు.. హీరో ఎలివేషన్ సన్నివేశాలున్నాయి. అవి విజయ్ అభిమానులను తృప్తి పరుస్తాయి. ముఖ్యంగా ‘సర్కార్’, ‘విజిల్’, ‘మాస్టర్’ కలబోతతో చెప్పే ‘కుట్టి స్టోరీ’ (పిట్ట కథ) వినోదాన్ని పండిస్తుంది. ఇక, అద్దాల మేడలు, రోల్స్‌రాయల్స్ కారులో షికార్లు, రిచ్ జీవితం.. వంటి అంశాలు బీ, సీ సెంటర్ ప్రేక్షకులు రిలేట్ చేసుకోవడం కష్టం. పాటలు, విజయ్ డ్యాన్సులు.. బాగా వర్కవుట్ అయ్యాయి. యోగిబాబుతో కలిసి విజయ్ నవ్వులు పూయించే ప్రయత్నమూ చేశారు. సినిమా చూశాక ఒకట్రెండు పాత సినిమాలు గుర్తొచ్చే అవకాశాలున్నాయి. (Vijay - Vamshi Paidipally Vaarasudu Review)
ఎలా నటించారు?
విజయ్ లుక్స్ సినిమాలో హైలైట్. తనదైన శైలి చురకలు, నటన, మాస్ సన్నివేశాల్లో విజయ్‌లోని పవర్ ప్రధాన బలాలు. విజయ్ కాస్ట్యూమ్స్ విషయంలో పెట్టిన శ్రద్ధ దర్శకుడు కథపై కూడా పెట్టాల్సింది. రష్మిక కొన్ని సన్నివేశాలకు, పాటలకే పరిమితమైంది. జయసుధ నటన సినిమాకు బలాన్ని చేకూర్చుతుంది. శరత్ కుమార్ తన పాత్రకు న్యాయం చేశారు. ప్రకాశ్‌రాజ్ పాత విలనే! అవే డైలాగులు, అవే కుట్రలు, కుతంత్రాలు. ఉన్నంతలో శ్రీకాంత్ మెప్పిస్తారు. అయితే, ఆ పాత్రకు ఇంకాస్త స్కోపు ఇచ్చి ఉంటే బాగుండేది. శామ్ సెకండాఫ్‌లో స్కోర్ చేశాడు. కార్తిక్ పళని కెమెరా పనితనం బాగుంది. తమన్ సంగీతం సినిమాకు బలం. పాటలు మెప్పించాయి. హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినట్టుంది. వాణిజ్య అంశాలు, మాస్ సన్నివేశాలను మేళవించి ఉంటే ఇంకా బాగుండేది. (Vijay - Dil Raju Vaarasudu Review)
బలాలు: + విజయ్ నటన, + పాటలు, కామెడీ + జయసుధ నటన
బలహీనతలు: - పాత చింతకాయ పచ్చడి కథ, - అతకని సెంటిమెంట్
ఆఖరు మాట: కొత్తదనం లేని ‘వారసుడు’ (Vaarasudu Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP Govt: పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
-
World News
PM Modi: మోదీ అసాధారణ నేత.. చైనాలో భారీగా ఆదరణ
-
Politics News
Balineni: పట్టభద్రుల్లో అసంతృప్తి నిజమే: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
-
Ap-top-news News
AP Govt: ఎవరి గ్లాసు వారే తెచ్చుకోండి.. రాగి జావ పోస్తాం
-
Politics News
Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. 2024 పూర్తి సినిమా: నారా లోకేశ్