Vijay: విజయ్‌ మంచి మనసు.. వరద బాధితుల కోసం కదిలివచ్చిన నటుడు

నటుడు విజయ్‌ (Vijay) తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల తమిళనాడులో ఏర్పడిన వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఆయన సాయం అందించారు.

Published : 30 Dec 2023 17:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌ నటుడు విజయ్‌  (Vijay) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులో ఇటీవల ఏర్పడిన వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ మేరకు శనివారం ఉదయం తూత్తుకుడి, నెల్లైలో పర్యటించిన ఆయన.. బాధితులకు బియ్యం, కూరగాయలతోపాటు పలు నిత్యావసరాలు అందించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. విజయ్‌ గొప్ప మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

సినిమాల విషయానికి వస్తే.. ‘వారిసు’, ‘లియో’తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు విజయ్‌. ప్రస్తుతం ఆయన వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విజయ్‌ 68గా ఈ ప్రాజెక్ట్‌ ప్రచారంలో ఉంది. మీనాక్షి చౌదరి కథానాయిక. ప్రశాంత్‌, స్నేహ, లైలా, జయరామ్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని