Liger: అదరహో అనిపించే సీన్స్‌తో యాక్షన్‌+మాస్‌ ఎంటర్‌టైనర్‌గా లైగర్‌ ట్రైలర్‌

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన....

Updated : 21 Jul 2022 10:00 IST

హైదరాబాద్‌: సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన ఫుల్‌లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైగర్‌’ (Liger) ట్రైలర్‌ విడుదలైంది. పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను గురువారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ‘‘ఒక లయన్‌కి టైగర్‌కి పుట్టిండాడు. క్రాస్‌ బ్రీడ్‌ సార్‌ నా బిడ్డ’’  అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో విజయ్‌ దేవరకొండ‌ చేసిన స్టంట్స్‌, ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌తో(Mike Tyson) బాక్సింగ్‌ సన్నివేశాలు, అనన్యతో రొమాన్స్‌.. ఇలా ప్రతి సన్నివేశం మాస్‌ని మెప్పించేలా ఉంది. ఇక ట్రైలర్‌లోని సన్నివేశాలు చూస్తే ఇందులో విజయ్‌కి నత్తి ఉన్నట్లు అనిపిస్తుంది. పవర్‌ఫుల్‌ సీన్స్‌ ఈలలు వేయించేలా ఉన్నాయి.

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే మొదటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ఇది. మథర్‌ సెంటిమెంట్‌, కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజయ్‌కు తల్లిగా అలనాటి నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. అనన్యపాండే కథానాయిక. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 25 ఈ సినిమా విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని