Vijay Deverakonda: సినిమా ప్రీమియర్‌.. మెరిసిన విజయ్‌ దేవరకొండ, రాశీఖన్నా.. ఫొటోలు వైరల్‌

విజయ్‌ దేవరకొండ, రాశీఖన్నా కలిసి ఓ సినిమా ప్రీమియర్‌కి వెళ్లారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 14 Jul 2023 02:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్‌ (Anand Deverakonda) హీరోగా సాయి రాజేశ్‌ (Sai Rajesh) తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’ (Baby). వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కథానాయిక. విరాజ్‌ అశ్విన్‌ (Viraj Ashwin) కీలక పాత్ర పోషించాడు. జులై 14న విడుదలకానున్న ఈ సినిమాని ముందుగానే ప్రేక్షకులు వీక్షించేందుకు జులై 13న ప్రీమియర్స్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్‌, రాశీఖన్నా (Rashi Khanna) సినిమాని చూసేందుకు హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కి వెళ్లారు. వారు థియేటర్‌లోకి ప్రవేశించే సమయంలో అభిమానులు తీసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఇద్దరు కలిసి ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ (World Famous Lover) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

‘దొరసాని’తో తెరంగేట్రం చేశాడు ఆనంద్‌. రెండో సినిమా ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’తో మంచి గుర్తింపు పొందాడు. ‘పుష్పక విమానం’తో ప్రేక్షకులకు నవ్వులు పంచి, ‘హైవే’తో థ్రిల్‌కి గురి చేసిన ఆయన ‘బేబీ’లో కొత్తగా కనిపించనున్నాడు. ఈ సినిమా గురించి ఆనంద్‌ దేవరకొండ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘‘మీ అన్నయ్య విజయ్‌కి మాస్‌ ఇమేజ్‌ వచ్చింది కదా. నువ్వెందుకు అలాంటి కథలు ఎంపిక చేసుకోవట్లేదు. సేఫ్‌ గేమ్‌ ఆడాలనుకుంటున్నావా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. మాస్‌ అంటే ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. ప్రేమలో నిజాయతీ ఉండడమే నా ఉద్దేశంలో మాస్‌. ఆ కోణంలో చూస్తే ‘బేబీ’ మాస్‌ సినిమా. యువతకు బాగా కనెక్ట్‌ అవుతుంది’’ అని అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని