MAA Election: సీవీఎల్‌కు రాములమ్మ సపోర్ట్
సినిమా షూటింగులతో సందడిగా ఉండే టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల కారణంగా వాతావరణం వేడెక్కింది. ‘మా’లో ఇకపై తెలంగాణ, ఆంధ్రా అని రెండు విభాగాలు ఉండాలంటూ నటుడు సీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
సీవీఎల్ వాదన ధర్మమైంది: విజయశాంతి
హైదరాబాద్: సినిమా షూటింగులతో సందడిగా ఉండే టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల కారణంగా వాతావరణం వేడెక్కింది. ‘మా’లో ఇకపై తెలంగాణ, ఆంధ్రా అని రెండు విభాగాలు ఉండాలంటూ నటుడు సీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కాగా, తాజాగా సీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నటి విజయశాంతి మద్దతు తెలిపారు. ఆయన వాదనలో నిజముందని ఆమె అన్నారు. ‘‘మా ఎన్నికలపై సీవీఎల్ నరసింహారావు ఆవేదన న్యాయమైంది, ధర్మమైంది. నేను ‘మా’ సభ్యురాలిని కాకపోయినా కళాకారిణిగా స్పందిస్తున్నా. చిన్న కళాకారుల సంక్షేమం దృష్ట్యా సీవీఎల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నా’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.
తెలంగాణ, ఆంధ్రా కళాకారుల సంక్షేమమే తన ధ్యేయంగా ఎన్నికల సంగ్రామంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన నరసింహారావు.. పరభాషా నటీనటుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులకు నష్టం వాటిల్లుతోందన్నారు. అసోసియేషన్‌కు సంబంధించి 18 మంది కార్యవర్గ సభ్యుల్లో 9 మంది ఆంధ్రావాళ్లని, మరో 9మంది తెలంగాణవాళ్లని తీసుకోవాలన్నారు. మరోవైపు నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణు, నటీమణులు హేమ, జీవితా రాజశేఖర్ సైతం ఈ ఏడాది ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Justin Trudeau : నిజ్జర్ విషయంలో అమెరికన్లు మాతోనే : జస్టిన్ ట్రూడో
-
Asian Games: షూటింగ్లో మరో రెండు స్వర్ణాలు.. టెన్నిస్‌లో రజతం
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి