Chiyaan 61: ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘చియాన్‌ 61’ టైటిల్‌ వీడియో.. మరోసారి ప్రయోగాత్మక పాత్రలో!

ఇప్పటికే పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించిన విక్రమ్‌ మరోసారి ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నారు. పా రంజిత్‌ దర్శకత్వంలో ఆయన యాక్ట్‌ చేస్తున్న సినిమా టైటిల్‌ ఖరారైంది.

Published : 24 Oct 2022 00:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విక్రమ్‌ హీరోగా దర్శకుడు పా రంజిత్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. #Chiyaan61 వర్కింగ్ టైటిల్‌తో ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా అధికారిక టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. ‘తంగలాన్‌’ (Thangalaan) అనే పేరును ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. పల్లెటూరి వ్యక్తిగా విక్రమ్‌ లుక్‌, హావభావాలు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా పీరియాడికల్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. మాళవిక మోహనన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. హీరోగా విక్రమ్‌కు ఇది 61వ చిత్రం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని