Vishal: ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదు.. కానీ: విశాల్‌

ప్రజల కోసం మాట్లాడేందుకు ఎప్పుడూ వెనుకాడనని నటుడు విశాల్‌ అన్నారు.

Published : 07 Feb 2024 13:19 IST

చెన్నై: తాను రాజకీయపార్టీ స్థాపించనున్నట్టు ప్రచారమవుతోన్న వార్తలపై నటుడు విశాల్‌ స్పందించారు. అవి రూమర్స్‌ అని కొట్టిపారేశారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడంలేదన్నారు. కానీ, ప్రజా సేవ మాత్రం కొనసాగిస్తానని చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్‌లో ఓ నోట్‌ విడుదల చేశారు.

‘నటుడిగా, సమాజసేవకుడిగా నన్ను అభిమానిస్తున్న తమిళనాడు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రజలకు సేవ చేయాలని, ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వాలనే లక్ష్యంతోనే నా ఫ్యాన్స్‌ క్లబ్‌ను నిర్వహిస్తున్నాం. దాన్ని ‘విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం’ (విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి జిల్లాల వారిగా, నియోజక వర్గాల వారిగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. మా అమ్మ పేరు మీద నెలకొల్పిన ‘దేవి ఫౌండేషన్‌’తో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు, బాధిత రైతులకు సాయం చేస్తున్నాం. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని తగిన సాయం చేస్తూ, పరిష్కరిస్తూ వస్తున్నా. సంక్షేమ కార్యక్రమాల వల్ల  రాజకీయ లబ్ధిని నేనెప్పుడూ ఆశించలేదు. భవిష్యత్తులో ప్రజల కోసం మాట్లాడేందుకు ఎప్పుడూ వెనకాడను’ అని పేర్కొన్నారు. కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో విశాల్‌ కూడా రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారని వార్తలు వైరలయ్యాయి. తాజా ప్రకటనతో వాటికి తెరపడింది.

‘లగాన్‌’లో ఛాన్స్‌ వదులుకుని.. సౌత్‌లో టాప్‌ విలన్‌ అయ్యారు!

మరోవైపు విశాల్‌ తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. హరి దర్శకత్వంలో ‘రత్నం’గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తయింది. కుటుంబ అంశాలతో నిండిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని