Gaami: అఘోరాగా విశ్వక్‌సేన్‌.. ‘గామి’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

విశ్వక్‌ కొత్త చిత్రం ‘గామి’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది.

Published : 28 Jan 2024 17:10 IST

హైదరాబాద్‌: విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ. లోతైన కోరిక కూడా మానవ స్పర్శే. ఒక వ్యక్తి విభిన్నమైన కథ.. భయాన్ని జయించడానికి అతడి ప్రయాణం’’ అని క్యాప్షన్‌ జత చేసింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఇందులో విశ్వక్‌ అఘోరాగా కనిపించనున్నారు. చాందినీ చౌదరి కథానాయిక. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prasanth Varma: ఆ విషయంలో రాజమౌళిపై కోపం వచ్చింది: ప్రశాంత్‌ వర్మ

‘గామి’ని ఉద్దేశించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశ్వక్‌ స్పందించారు. దాదాపు నాలుగున్నర ఏళ్లగా దాని కోసం వర్క్‌ చేస్తున్నట్లు చెప్పారు. తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందన్నారు. హిమాలయాలు, వారణాసి వంటి ప్రాంతాల్లో షూట్‌ చేశామన్నారు. కథ విషయంలో దర్శకుడు ఎంతో స్పష్టంగా ఉన్నారని తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తైందని.. చిత్రం విడుదలకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని