Prasanth Varma: ఆ విషయంలో రాజమౌళిపై కోపం వచ్చింది: ప్రశాంత్‌ వర్మ

‘హను-మాన్‌’తో విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma). రెండు వారాల్లోనే ఇది రూ.250 కోట్లు వసూలు చేసింది.

Published : 28 Jan 2024 12:26 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అంటే తనకెంతో ఇష్టమని ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) అన్నారు. జక్కన్న టీమ్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. ‘‘ఆయన మేకింగ్‌ స్టైల్‌ నాకెంతో ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించా. ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడే.. ఛాన్స్‌ కోసం మెయిల్స్‌ పంపించా. నా అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు.  టీమ్‌లో ఖాళీ లేదన్నారు. హార్డ్‌వర్క్‌, టాలెంట్‌ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చింది. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు. రాజమౌళి సినిమాలు, మేకింగ్‌ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నా’’

సెకండాఫ్‌ బాలేదంటే ఫోన్‌ పెట్టేశాడు..: విజయ్‌ తండ్రి విమర్శలు లోకేశ్‌ కనగరాజ్‌ని ఉద్దేశించేనా..?

‘‘పెద్ద హీరోలతో పని చేయడానికి వ్యతిరేకం కాదు. వాళ్లతో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుంది. వాళ్ల కోసం ఎదురుచూసి నా సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలున్నాయి. ఆ తర్వాత డెడ్‌లైన్‌ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. ఒకవేళ టామ్‌ క్రూజ్ వచ్చినా.. నా వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తా’’ అని ప్రశాంత్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని