Gaami: విశ్వక్‌ సేన్‌ ‘గామి’ సెన్సార్‌ రిపోర్టు.. రన్‌టైమ్‌ ఎంతంటే?

విశ్వక్‌ సేన్‌ అఘోరాగా కనిపించనున్న ‘గామి’ చిత్రం సెన్సాన్‌ పనులు పూర్తయ్యాయి.

Published : 06 Mar 2024 00:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాందినీ చౌదరి కథానాయిక. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్‌ అఘోరాగా కనిపించనున్నారు. మార్చి 8న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. రన్‌టైమ్‌ 2:26 నిమిషాలు ఉంటుందని సినీ వర్గాల సమాచారం. ఈ ట్రైలర్‌పై ప్రభాస్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఈ చిత్రం గురించి విశ్వక్ సేన్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ..‘‘గామి’ని ప్రారంభించినప్పుడు నేనెవరో మీకు తెలియదు. నా కెరీర్‌ తొలి నాళ్లలో మొదలుపెట్టిన సినిమా ఇది. నా నుంచి మీరు కోరుకునే మాస్‌ డైలాగ్స్‌, ఉర్రూతలూగించే పాటలు, ఫైట్లు ఇందులో ఉండవు. కానీ, వాటికి ఎంత ఎంజాయ్‌ చేస్తారో ఈ కథకూ అంతే ఎంజాయ్‌ చేస్తారు’ అని హామీ ఇచ్చారు. ఇందులో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందన్నారు. హిమాలయాలు, వారణాసి వంటి ప్రాంతాల్లో షూట్‌ చేశామన్నారు. కథ విషయంలో దర్శకుడు ఎంతో స్పష్టంగా ఉన్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని