Oscars 2024: ఆస్కార్‌ గెలిచిన సినిమాలు.. స్ట్రీమింగ్‌ ఇక్కడే..

ఆస్కార్‌ బరిలో పోటీపడి గెలుపొందిన సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయోనని తెగ వెతికేస్తున్నారు.

Published : 11 Mar 2024 13:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేడు సినీ ప్రియులకు పండగ రోజు. వారి అభిమాన చిత్రాలు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకున్నరోజు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సారి కూడా లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ ఈ వేడుకకు వేదికగా మారింది. దీంతో ఆస్కార్‌ అవార్డులు గెలిచిన చిత్రాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు సినీ ప్రియులు. ఇంకెందుకు ఆలస్యం.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుందో చూసేయండి (Oscar Awards 2024). 

  • ఓపెన్‌హైమర్‌ (oppenheimer) :  జియో సినిమా (మార్చి 21 నుంచి అందుబాటులోకి రానుంది)
  • పూర్‌ థింగ్స్‌ (Poor Things): డిస్నీ+హాట్‌ స్టార్‌ 
  • ది హోల్డోవర్స్‌: అమెజాన్‌ ప్రైమ్‌
  • అమెరికన్‌ ఫిక్షన్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • బార్బీ (Barbie): జియో సినిమా
  • గాడ్జిల్లా మైనస్‌ వన్‌: ప్రస్తుతం అందుబాటులో లేదు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని