తొలి వార్షిక సదస్సు ఘనంగా నిర్వహించాలని ‘మాటా’ బోర్డు నిర్ణయం

వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 13, 14 తేదీలలో న్యూజెర్సీలో రాయ‌ల్ అల్బ‌ర్ట్ ప్యాలెస్‌లో 'మాటా' తొలి వార్షిక స‌ద‌స్సును ఘనంగా నిర్వహించాలని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

Published : 06 Dec 2023 16:23 IST

ఫిలిడెల్ఫియా:  అమెరికాలో  'మ‌న అమెరికా తెలుగు సంఘం' (మాటా)  బోర్డు సమావేశం ఫిలడెల్ఫియాలోని ఫిల్లీ చాప్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో  శనివారం జరిగింది. కింగ్ ఆఫ్ ప్రుశ్యాలోని క్రౌన్ ప్లాజా ఫిలిడెల్ఫియాలో ‘మాటా’ అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్ గ‌న‌గోని ఆధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ ఈ స‌మావేశంలో  బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా 'మాటా' విస్త‌రిస్తున్న క్ర‌మంపై బోర్డు స‌భ్యులంతా హర్షం వ్యక్తంచేశారు. మాటా ప్రారంభమైన అనతి కాలంలోనే అనేక కార్యక్రమాలతో ప‌లుచోట్ల‌ విస్త‌రిస్తూ పెద్ద సంస్థ‌గా గుర్తింపు పొందుతోందన్నారు. ఇప్ప‌టికే 25 న‌గ‌రాల్లో 3వేలకు పైగా కుటుంబాలు; వ్యక్తిగత సభ్యత్వాల ప్రకారం చూసుకుంటే 7500లకు చేరుకుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో ‘మాటా’ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. కులమత, ప్రాంతీయ భేదాలు లేకుండా తెలుగు వారందరినీ కలుపుకొని తీసుకెళ్లాలన్న ఉద్దేశమే ఈ సంస్థ ఇంత త్వరగా వృద్ధి చెంద‌డానికి కార‌ణ‌మ‌ని 'మాటా' బోర్డు స‌భ్యులు చెబుతున్నారు. 

‘మాటా’ బోర్డు సమావేశంలో తమ భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మాల‌పై స‌భ్యులంతా చ‌ర్చించారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 13, 14 తేదీలలో న్యూజెర్సీలో రాయ‌ల్ అల్బ‌ర్ట్ ప్యాలెస్‌లో 'మాటా' తొలి వార్షిక స‌ద‌స్సును ఘనంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.  మరోవైపు, వార్షిక స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ కోసం మాటా బోర్డు $225,000 డాల‌ర్ల‌ను సేకరించింది. డిసెంబర్ 9న చికాగోలో, డిసెంబర్ 16న సీటెల్‌లో, డిసెంబర్ 17న బే ఏరియాలో కిక్ ఆఫ్ ఈవెంట్‌లను నిర్వహించాలని మాటా టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ బోర్డు స‌మావేశానికి హాజ‌రైన 'తానా' సంఘం నాయ‌కులు రవి పొట్లూరి 'మాటా'కు మద్దతు తెలిపారు. 'త్రిబుల్ ఏ' ఆర్గ‌నైజేష‌న్ స‌భ్యులు కూడా పాల్గొని మ‌ద్ద‌తు ప్రకటించారు. బోర్డు స‌మావేశం అనంత‌రం కమ్యూనిటీ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా క‌ల్చ‌ర‌ల్ ప్రొగ్రామ్‌, లైవ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌ నిర్వహించారు.  గౌరవ సలహాదారులు డాక్టర్ హరి ఎప్పనపల్లి, ప్రసాద్ కూనిశెట్టి, బాబురావు సామల, వెంకటేష్ ముత్యాల, జైదీప్ రెడ్డి 'మాటా' బోర్డు క‌మిటీకి విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు. 

ఈ బోర్డు స‌మావేశంలో ఎగ్జిక్యూటివ్ టీమ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్ర‌వీణ్ గూడురు, ట్రెజరర్‌ గంగాధ‌ర్ వుప్పాల‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ కిర‌ణ్ దుడ్డ‌గి, జాయింట్ సెక్ర‌ట‌రీ టోనీ జాను, అడిష‌న‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌ధ‌ర్ పెంట్యాల‌,  జాయింట్ ట్రెజరర్‌  వెంక‌ట్ సుంకిరెడ్డి, నేష‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ విజ‌య్ భాస్క‌ర్ క‌లాల్, ఈవెంట్ డైరెక్ట‌ర్ స్వాతి అట్లూరి, క‌మ్యూనిటీ సర్వీస్ డైరెక్ట‌ర్ న‌గేష్ చిల‌క‌పాటి, ఇంట‌ర్నేష‌న‌ల్ ఉపాధ్య‌క్షులు రాజ్ ఆనందేశి, శ్రీ‌ధ‌ర్ గుడాల‌, శ్రీ‌నివాస్ తాటిపాముల‌, ఇండియా కో-ఆర్డినేట‌ర్ డా. విజ‌య్ భాస్క‌ర్ బోల్గం.. వంటి వారితో పాటు ఇతర డైరెక్టర్ల బోర్డు స‌భ్యులు మల్లిక్ బొల్లా, మహేందర్ నరలాల, డా. సరస్వతి, కృష్ణశ్రీ గంధం, పావని సనం, రామ్ మోహన్ చిన్నాల, , విజయ్ గడ్డం, ప్రశాంతశ్రీ పెరంబుదూరు, యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు సలహా మండలి స‌భ్యులు జితేందర్ రెడ్డి, ప్రదీప్ సామల, గౌర‌వ స‌ల‌హాదారులు, అడ్వైజ‌రీ కౌన్సిల్ స‌భ్యులు, వివిధ చాప్ట‌ర్‌ల‌కు చెందిన వీఆర్‌పీలు, స్టాండింగ్ కమిటీ, ఆర్‌సీలు బోర్డు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని