‘అమరావతి రాజధాని’పై 16న రౌండ్‌ టేబుల్‌ సమావేశం

రాజధానుల విభజన మంటల్లో రాష్ట్రాన్ని తగలబెట్టొద్దని తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్  జయరాం కోమటి హితవు పలికారు.

Published : 13 Oct 2022 22:26 IST

వాషింగ్టన్‌ డీసీ: రాజధానుల విభజన మంటల్లో రాష్ట్రాన్ని తగలబెట్టొద్దని తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్  జయరాం కోమటి హితవు పలికారు. ఈ నెల 16న ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు వాషింగ్టన్ డీసీ, వర్జీనియా నగరంలో అమరావతి రాజధాని అంశంపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన తదితరులు పాల్గొననున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తూ రాష్ట్ర సమైక్యతకు, సమగ్రతకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణ ముసుగులో ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారని.. రాష్ట్ర నడిబొడ్డున నిర్మిస్తున్న రాజధానిపై మీకొచ్చిన బాధ ఏమిటని ప్రశ్నించారు.

అమరావతి రాజధాని సమస్య ఒక ప్రాంతానికే పరిమితమైన అంశంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో సైతం అమరావతి రాజధానికి మద్దతు తెలియజేస్తున్నామన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు న్యాయస్థానం అనుమతిచ్చినప్పటికీ అడ్డంకులు సృష్టించడం సరైన పద్ధతికాదన్నారు. అమరావతి రాజధాని అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని మేధావులు, విజ్ఞులు, ప్రవాసాంధ్రులందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జయరాం విజ్ఞప్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని