NTR-Newyork: ఎన్టీఆర్ భారీ డిస్‌ప్లే.. ‘టైమ్ స్క్వేర్’లో శత జయంతి నీరాజనం
తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో ‘అన్న ఎన్టీఆర్’ పేరిట భారీ డిస్ ప్లే కొలువుదీరింది.
ఇంటర్నెట్ డెస్క్: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో ‘అన్న ఎన్టీఆర్’ పేరిట భారీ డిస్ ప్లే కొలువుదీరింది. 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో రూపొందించిన డిస్‌ప్లేను మే 27 అర్ధరాత్రి నుంచి 28 అర్ధరాత్రి వరకు ఏకధాటిగా 24 గంటలపాటు ప్రదర్శితమయ్యేలా ఎన్నారై తెదేపా-అమెరికా ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎన్నారై తెదేపా నేత జయరాం కోమటి పర్యవేక్షణలో అమెరికాలోని 28 నగరాల్లో ఉన్న కార్యనిర్వాహక కమిటీ సభ్యులంతా ఈ డిస్‌ప్లే ఏర్పాటుకు సహకారం అందించారు.
సినిమాల్లో ఎన్టీఆర్ నటించిన విభిన్న క్యారెక్టర్లను ‘అన్న ఎన్టీఆర్’ డిస్‌ప్లేలో ప్రదర్శించారు. ఎన్టీఆర్ రూపంలో ఆసేతు హిమాచలం స్థాయికి ఎదిగిన తెలుగింటి కీర్తి.. అమెరికాలో అత్యంత ఖరీదైన న్యూయార్స్‌లోని 'టైమ్ స్క్వేర్'లో ప్రదర్శించడం గౌరవంగా భావిస్తున్నట్లు ఎన్నారై తెదేపా నేతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు ‘అన్న ఎన్టీఆర్’ డిస్‌ప్లేను ఆసక్తిగా గమనిస్తున్నారని.. ఈ ప్రదర్శన వారిని కన్ను తిప్పుకోకుండా చేసిందన్నారు. పర్యాటకులు ఆయన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ఎన్టీఆర్‌కు సంబంధించిన విభిన్న చిత్రాలను ఈ ప్రకటన ద్వారా ప్రసారం చేయనున్నారు. ఈ భారీ డిస్‌ప్లే ఏర్పాటుతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ప్రపంచ పర్యాటకులని, కన్ను తిప్పకుండా చేసింది.

Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం