Hongkong: హాంకాంగ్‌ తెలుగు సామాఖ్య ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు

హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ట్యూన్ మున్ కంట్రీ పార్కులో కార్తిక మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Published : 04 Dec 2023 14:54 IST

హాంకాంగ్‌: హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ట్యూన్ మున్ కంట్రీ పార్కులో కార్తిక మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలుగు ప్రజలంతా ఒకచోట చేరి ఆట పాటలతో సరదాగా గడిపారు. రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య సభ్యులందరికీ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ధన్యవాదాలు తెలిపారు. హాంకాంగ్‌లో ప్రజల ఆరోగ్య, ఆహ్లాదం, శ్రేయస్సు కోసం అక్కడ వున్న కంట్రీ పార్కుల గురించి, తాము వనభోజనం కోసం వచ్చిన పార్కు గురించి కొన్ని విశేషాలను ఆమె వివరించారు. 

‘‘ హాంకాంగ్ కేవలం ఆకాశహర్మ్యాలు, రద్దీగా ఉండే వీధులు మాత్రమే కాదు. నగరంలో చాలా సుందరమైన, పచ్చని ప్రదేశాలు ఉన్నాయి. అవుట్‌డోర్‌ అడ్వంచర్‌ కోసం అంతులేని అవకాశాలు ఉన్నాయి. ట్యూన్ మున్ పార్కు మొత్తం 12.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. పార్కును మూడు దఫాలుగా విస్తరించారు. ఫేజ్ I ఆగస్టు 1985లో, ఫేజ్ II ఆగస్టు 1988లో, ఫేజ్ III ఫిబ్రవరి 1991లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ పార్క్ టుయెన్ మున్ జిల్లా పట్టణ కేంద్రంలో, ట్యూన్ మున్ టౌన్ హాల్ పరిసరాల్లో ఉంది’’ అని జయ పీసపాటి చెప్పారు. ఈ ఉద్యానవనంలో సుమారు 1500 చెట్లు, 200 జాతులకు చెందిన 1,00,000 పొదలు ఉన్నట్లు తెలిపారు. ఈ పార్కులో దాదాపు 1 హెక్టారు విస్తీర్ణంలో కృత్రిమ సరస్సు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని