Komatireddy: తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డిది కీలకపాత్ర: మంత్రి కోమటిరెడ్డి

నెక్లెస్‌రోడ్‌లోని స్ఫూర్తి స్థల్‌ వద్ద కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంత్రులు నివాళులర్పించారు. 

Updated : 16 Jan 2024 15:00 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటుకు నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒప్పించడంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నెక్లెస్‌రోడ్‌లోని స్ఫూర్తి స్థల్‌ వద్ద జైపాల్‌ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్‌ నేతలతో కలిసి కోమటిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 

‘‘తెలంగాణ తప్పకుండా వస్తుందని.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని నాయకులు, ఉద్యమకారులకు జైపాల్‌రెడ్డి చెప్పేవారు. హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం కాబోదని భరోసా ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా పనిచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని