Bumrah: క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఆ ముగ్గురే..!

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. గతంలో ఇటువంటి గౌరవాన్ని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దక్కించుకొన్నారు. 

Updated : 08 Feb 2024 11:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించడం కోసం ఆటగాళ్ల మధ్య పోటీ ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కనీసం ఒక సారైనా నంబర్‌ వన్‌గా నిలిచింది మాత్రం ముగ్గురే. దానిలో ఇద్దరు భారత క్రికెటర్లే ఉండటం విశేషం.

బుమ్రా (jasprit Bumrah)

క్రికెట్‌ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో నంబర్‌ వన్‌ ర్యాంకును సాధించిన తొలి బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. 2017లో తొలిసారిగా టీ20ల్లో అగ్రస్థానాన్ని అతడు దక్కించుకొన్నాడు. 2018లో వన్డేల్లో టాప్‌ ర్యాంక్‌కు చేరిన ఈ స్టార్‌ బౌలర్‌ 2022 వరకు కొనసాగాడు. తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. 

విరాట్‌ కోహ్లీ (Virat Kohli)

మూడు ఫార్మాట్లలో నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించిన మొదటి భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ. 2013లో అతడు వన్డేల్లో నంబర్‌ వన్‌గా అవతరించినా తొందరగానే ఆ స్థానాన్ని కోల్పోయాడు. తిరిగి 2017లో దక్కించుకుని.. దాదాపు 1500 రోజుల పాటు కొనసాగి చరిత్ర సృష్టించాడు. 2018లో టెస్టుల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించాడు. 2014లో టీ20ల్లో టాప్‌ ర్యాంక్‌ అందుకొన్నాడు.

రికీ పాంటింగ్‌ (Ricky Ponting)

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 2005లోనే వన్డే, టెస్టుల్లో, టీ20ల్లోనూ మొదటి ర్యాంకు సాధించడం విశేషం. అధికారికంగా జరిగిన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లోనే (ఆస్ట్రేలియాXన్యూజిలాండ్) పాంటింగ్‌ 98 పరుగులతో అజేయంగా నిలిచాడు. పొట్టి ఫార్మాట్‌లో ఈ ర్యాంక్‌ అందుకొన్న మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని