Virat Kohli: అతడు జట్టులో చేరితే మరింత బలంగా టీమ్‌ఇండియా: బ్రెండన్‌ మెకల్లమ్‌

విరాట్‌ కోహ్లీతో ఆడటాన్ని తాను, తన టీమ్‌లోని ఆటగాళ్లు ఆస్వాదిస్తారని ఇంగ్లాండ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ అన్నాడు. కోహ్లీ భారత జట్టులోకి రావాలని ఆకాంక్షించాడు. 

Published : 07 Feb 2024 20:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విరాట్‌ కోహ్లీ ( Virat Kohli) గొప్ప ఆటగాడని అతడితో ఆడటాన్ని ఆస్వాదిస్తామని ఇంగ్లాండ్‌ ప్రధాన కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌  (Brendon McCullum) అన్నాడు. కుటుంబ కారణాల వల్ల ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ (IND vs ENG)లో రెండు మ్యాచ్‌లకు కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వైజాగ్‌ టెస్టులో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంచేసిన భారత్‌ మిగిలిన మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేయాల్సిఉంది. కానీ విరాట్‌ అందుబాటులో ఉండటంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై బ్రెండన్‌ మెకల్లమ్‌ స్పందించాడు. ‘‘కోహ్లీ కుటుంబం క్షేమంగా ఉండాలి. అతడు గొప్ప ఆటగాడు. అతడు వస్తే జట్టు బలంగా మారుతుంది. భారత్‌లో నైపుణ్యం గల క్రికెటర్లు చాలామంది ఉన్నారు. మేమ ప్రత్యర్ధి ఆటగాడిని గౌరవిస్తాం. నేను, నా టీమ్‌ విరాట్‌తో ఆడటాన్ని ఆస్వాదిస్తాం. బలమైన ప్రత్యర్ధిపై గెలిస్తే మన సామర్ద్యం తెలుస్తుంది. మేము తరువాత మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నాం.’’అని అన్నాడు. 
రెండో టెస్టు అనంతరం భారత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid)ను కోహ్లీ పునరాగమనంపై ప్రశ్నించగా ‘‘అతడితో చర్చించాల్సి ఉంది. కానీ దీని గురించి సెలెక్టర్లను అడిగితే బాగుంటుంది. వారే సరైన సమాధానం ఇస్తారు. తరువాత టెస్టులకు జట్టు ఎంపికపై కొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ’’అని అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని