Gautam Gambhir: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు గుడ్‌ బై చెప్పిన గంభీర్

భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ఐపీఎల్‌ (IPL)లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG)కి గుడ్‌ బై చెప్పాడు. తిరిగి తన పాత ఫ్రాంఛైజీ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR)లో చేరాడు.

Updated : 22 Nov 2023 12:48 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ఐపీఎల్‌ (IPL)లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG)కి గుడ్‌ బై చెప్పాడు. ప్రస్తుతం ఎల్‌ఎస్‌జీకి మెంటార్‌గా ఉన్న గంభీర్ ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడు తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR)లో చేరనున్నాడు. ఈ విషయాన్ని గంభీర్ అధికారికంగా ప్రకటించాడు. కేకేఆర్‌కు కొన్నాళ్లు నాయకత్వం వహించిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. కొన్నాళ్లపాటు అదే జట్టుకు మెంటార్‌గా పనిచేశాడు. రెండేళ్ల కిందట కేకేఆర్‌ని వదిలి కొత్తగా వచ్చిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా నియమితుడయ్యాడు. ఇప్పుడు తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గంభీర్‌ మార్గనిర్దేశంలో లఖ్‌నవూ 2022లో ఫైనల్‌కు చేరగా.. 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

ఎల్‌ఎస్‌జీని వీడటంపై గంభీర్‌ ఎమోషనల్ అయ్యాడు. ‘‘లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో నా అద్భుతమైన ప్రయాణం ముగిసిందని ప్రకటిస్తున్నా. ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్‌ స్టాఫ్, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నాకు మద్దతుగా నిలిచిన ఫ్రాంఛైజీ యజమాని డా.సంజీవ్ గోయెంకాకు ధన్యవాదాలు. జట్టు భవిష్యత్తులో అద్భుతాలు చేస్తుందని, ప్రతి ఎల్‌ఎస్‌జీ అభిమానిని గర్వించేలా చేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఎల్‌ఎస్‌జీ బ్రిగేడ్!’’ అని గంభీర్‌ ఎక్స్‌(X)లో పోస్టు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని