IND vs PAK: భారత్‌-పాక్‌ పోరు కోసం ఆసుపత్రిలో మకాం

అహ్మదాబాద్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే ప్రపంచకప్‌ మెగా మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఎలా తహతహలాడుతున్నారో అనేందుకు ఇదే ఉదాహరణ

Updated : 13 Oct 2023 07:14 IST

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే ప్రపంచకప్‌ మెగా మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఎలా తహతహలాడుతున్నారో అనేందుకు ఇదే ఉదాహరణ. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు బయట ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు అహ్మదాబాద్‌ ఆసుపత్రుల్లో మకాం పెడుతున్నారు! చిత్రంగా ఉన్నా ఇది నిజం. హోటల్‌ గదులన్నీ ఇప్పటికే దాదాపు కిక్కిరిసిపోవడం, సాధారణ ధరలకన్నా 20 రెట్లు పెరగడంతో ఎలాగైనా మ్యాచ్‌ చూడాలన్న పట్టుదలతో ఉన్న అభిమానులు.. స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో ఆరోగ్య పరీక్షల ప్యాకేజీలు తీసుకుని బెడ్‌లు బుక్‌ చేసుకుంటున్నారు. మ్యాచ్‌ సమయానికి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. దీని వల్ల అటు వైద్య పరీక్షలు పూర్తవడంతో పాటు మ్యాచ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే రోగులకు తప్ప అభిమానులకు ఇవ్వడానికి కొన్ని ఆసుపత్రులు విముఖత చూపిస్తున్నాయి.


గిల్‌ బ్యాటింగ్‌ సాధన

అహ్మదాబాద్‌: భారత క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. డెంగీ నుంచి కోలుకుంటున్న ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మళ్లీ బ్యాటు పట్టాడు. గురువారం ఉదయం 11 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చిన గిల్‌.. గంటసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. పాక్‌ ఎడమచేతి వాటం షహీన్‌ అఫ్రిదిని దృష్టిలో పెట్టుకుని నెట్‌ బౌలర్‌ నువాన్‌ సెనెవిరత్నె (శ్రీలంక) గంటకు 150 కిమీ వేగంతో విసిరిన త్రోలను ఎదుర్కొన్నాడు. శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, మైద్య బృందం గిల్‌ సాధనను సునిశితంగా పరిశీలించిన తర్వాతే అతనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని