Rohit Sharma: కుర్రాళ్లూ.. కోహ్లిని చూసి నేర్చుకోండి: రోహిత్‌శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

విరాట్‌ కోహ్లి గురించి భారత క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో కోహ్లి ఎప్పుడూ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లలేదని..

Published : 29 Jan 2024 04:13 IST

హైదరాబాద్‌: విరాట్‌ కోహ్లి గురించి భారత క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో కోహ్లి ఎప్పుడూ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లలేదని.. ఎంత సాధించినా పరుగుల ఆకలితో తపిస్తూ ఉంటాడని రోహిత్‌ అన్నాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ తొలి టెస్టు నేపథ్యంలో వెటరన్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌తో ముచ్చటిస్తూ రోహిత్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘ఇప్పటిదాకా తన కెరీర్‌లో కోహ్లి ఎప్పుడూ ఎన్‌సీఏకు వెళ్లలేదు. అతడి ఫిట్‌నెస్‌కు ఇది నిదర్శనం. ఆట పట్ల కోహ్లి అంకితభావాన్ని, పరుగుల పట్ల ప్రేమని చూసి యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి. అతడు ఎలా కవర్‌ డ్రైవ్‌, ఫ్లిక్‌, కట్‌ షాట్లు ఆడుతున్నాడో గమనించాలి. అంతటి నాణ్యమైన ఆట వల్లే నేడు ఈ స్థితిలో ఉన్నాడు. ఇప్పటిదాకా విరాట్‌ ఎంతో సాధించాడు. దీనికే సంతృప్తి పడిపోవచ్చు. 2-3 సిరీస్‌లు ఆడకపోయినా ఫర్వాలేదు అని అతడు అనుకోవచ్చు. కానీ కోహ్లి దాహం తీరనిది. దేశానికి ఆడటాన్ని అతడు గర్వంగా భావిస్తాడు. కుర్రాళ్లు ఇదే నేర్చుకోవాలి’’ అని రోహిత్‌ అన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్‌.. మూడో టెస్టుకు అందుబాటులోకి వస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని