అంజు, హర్షితలకు రజతాలు

ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు అంజు (53కేజీ), హర్షిత రజతాలు సాధించారు. సెమీస్‌లో 9-6తో చున్‌ లీ (చైనా)పై గెలిచిన అంజు.. ఫైనల్లో పేలవ ప్రదర్శన చేసింది. జి హ్యాంగ్‌ కిమ్‌ (కొరియా)తో పోరులో ఆమె ఒక్క పాయింట్‌ కూడా సాధించలేకపోయింది.

Published : 15 Apr 2024 02:18 IST

బిష్కెక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు అంజు (53కేజీ), హర్షిత రజతాలు సాధించారు. సెమీస్‌లో 9-6తో చున్‌ లీ (చైనా)పై గెలిచిన అంజు.. ఫైనల్లో పేలవ ప్రదర్శన చేసింది. జి హ్యాంగ్‌ కిమ్‌ (కొరియా)తో పోరులో ఆమె ఒక్క పాయింట్‌ కూడా సాధించలేకపోయింది. అంజు టెక్నికల్‌ సుపీరియారిటీతో ఓడిపోయింది. మరోవైపు హర్షిత (72 కేజీ) ఫైనల్లో 2-5తో కియాన్‌ జియాంగ్‌ (చైనా) చేతిలో పరాజయంపాలైంది. ఫైనల్‌ చేరే క్రమంలో మూడు పాయింట్లు మాత్రమే ఇచ్చిన హర్షిత.. టైటిల్‌ పోరులో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతక విజేత సరిత మోర్‌ రిక్తహస్తాలతో వెనుదిరిగింది. 57 కేజీల క్వార్టర్స్‌లో ఆమె 4-8తో గాంటుయా ఎంఖ్‌బత్‌ (మంగోలియా) చేతిలో ఓడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని