IND vs NZ: న్యూజిలాండ్‌తో భారత్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌..ఈసారి కివీస్ గండం గట్టెక్కేనా?

వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్‌ఇండియా సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.

Updated : 11 Nov 2023 19:49 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో (ICC Cricket World Cup 2023) వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్‌ఇండియా (Team India) సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ (NZ)తో తలపడనుంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్‌ విజయం సాధించినా నాకౌట్‌కు అర్హత సాధించదు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని పాక్ 6.4 ఓవర్లలో ఛేదిస్తే న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ను అధిగమించి పాక్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కానీ, ఆ జట్టు 6.4 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాక్ అధికారికంగా సెమీస్ రేసు నిష్క్రమించింది. నవంబర్ 15న ముంబయిలో జరిగే తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబర్ 16న కోల్‌కతా వేదికగా రెండో సెమీ ఫైనల్‌ జరగనుంది. ఈ కీలక పోరులో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్ మ్యాచ్‌ నిర్వహించనున్నారు.

ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్.. 273 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని టీమ్ఇండియా.. 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (95) భారీ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

కివీస్ గండం దాటాలి

2019 ప్రపంచకప్‌లో సెమీస్‌లోనూ కివీస్, టీమ్ఇండియా తలపడ్డాయి. అప్పుడు భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఈ మోస్తరు లక్ష్యఛేదనలో భారత్ 221 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లీ (1) విఫలమడంతో ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (77), ఎంఎస్ ధోనీ (50) పోరాడినా టీమ్ఇండియాను విజయతీరాలకు చేర్చలేకపోయారు. లక్ష్యఛేదనలో 216 పరుగుల స్కోరు వద్ద ధోనీ రనౌట్‌గా వెనుదిరగడంతో టీమ్‌ఇండియా గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. ఈ సారైనా కివీస్ గండాన్ని గట్టెక్కి గత సెమీస్‌ పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నవంబర్ 16న కోల్‌కతా వేదికగా రెండో సెమీ ఫైనల్‌ జరగనుంది. ఈ కీలక పోరులో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని