IND vs PAK : ఎక్కడ చూసినా క్రికెట్‌ సందడే!

దేశంలో క్రికెట్‌ సందడి మొదలైంది. ఓ వైపు ఉత్కంఠ రేపే దాయాదుల పోరు.. మరోవైపు వారంతం.. దీంతో దేశవ్యాప్తంగా అభిమానుల సంతోషం రెట్టింపైంది...

Updated : 24 Oct 2021 14:15 IST

కోహ్లీసేనకు మద్దతుగా ప్రత్యేక పూజలు, హోమాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో క్రికెట్‌ సందడి మొదలైంది. ఓ వైపు ఉత్కంఠ రేపే దాయాదుల పోరు.. మరోవైపు వారంతం.. దీంతో దేశవ్యాప్తంగా అభిమానుల సంతోషం రెట్టింపైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో నేడు కీలక పోరు జరగనున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా, ఎవరిని కదిలించినా ఈ మ్యాచ్‌ గురించే చర్చ. అభిమానులు అంతగా ఈ పోరు గురించి ఎదురుచూస్తున్నారు. పాక్‌పై ఇప్పటి వరకూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని ఆశిస్తున్నారు. కోహ్లీ సేనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు పలువురు అభిమానులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తుండటం విశేషం.

పాక్‌తో మ్యాచ్‌లో గెలవాలని, అలాగే టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ కూడా సాధించాలని బెంగళూరు, దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాల్లో అభిమానులంతా ఒక్క చోట చేరి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పలువురు వీరాభిమానులు ఒంటికి రంగులు పూసుకొని త్రివర్ణ పతాకం చేతబూని వీధుల్లో తిరుగుతున్నారు. అలా కోహ్లీసేనపై తమ అభిమానాన్ని చాటుతున్నారు. దాయాది జట్టును ఓడించి మరోసారి ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సత్తా చాటాలని కోరుతున్నారు.

మరోవైపు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు పలు నగరాల్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మల్టీఫ్లెక్స్‌లు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అలాగే యువత బెట్టింగ్‌లకు పాల్పొడొద్దని పలువురు హెచ్చరిస్తున్నారు. ఆటలను ఆస్వాదించాలే కానీ.. వాటి వైపు వెళ్లొద్దని సూచిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని