Paris Olympics: 10,500 మంది క్రీడాకారులు.. పడవలపై పరేడ్‌..!

పారిస్‌ ఒలింపిక్స్ (Paris Olympics) ప్రారంభోత్సవాన్ని జులై 26న సాయంత్రం నగరంలోని సెన్ నది వేదికగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Published : 08 Mar 2024 23:20 IST

పారిస్‌: విశ్వక్రీడలకు ఫ్రాన్స్‌ (France) సన్నద్ధమవుతోంది. జులై 26న సాయంత్రం పారిస్‌లోని సెన్ నది వేదికగా ఒలింపిక్స్ (Paris Olympics) ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌ నినాదమైన ‘‘గేమ్స్ వైడ్ ఓపెన్‌’’కు అనుగుణంగా.. స్టేడియం సెట్టింగ్ వెలుపల ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. ఇలా చేయడం ఒలింపిక్స్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. దాదాపు 10,500 మంది క్రీడాకారులు.. సెన్‌ నదిపై ఆరు కిలోమీటర్ల దూరం మేర పడవలపై పరేడ్‌లో పాల్గొననున్నారు. లండన్‌ తర్వాత విశ్వక్రీడలకు మూడుసార్లు ఆతిథ్యమిచ్చిన రెండో నగరంగా పారిస్‌ రికార్డుల్లోకెక్కనుంది.

మరో ప్రపంచంలోకి..! పారిస్‌ ఒలింపిక్స్‌ విశేషాలివే

స్థానిక కాలమానం ప్రకారం.. జులై 26న సాయంత్రం 7.30 గంటలకు వేడుకలు షురూ కానున్నాయి. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారుల సెన్‌ నదీ విహారాన్ని.. అస్తమించే సూర్యుడి సహజ వెలుగులు ప్రకాశమంతం చేయనున్నాయి. ఈ కార్యక్రమం అపూర్వమైన అనుభూతిని అందజేస్తుంది’’ అని నిర్వాహకులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పర్యాటకులందరికీ ఉచిత ప్రవేశం ఉండదని ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఇటీవల తెలిపింది. ఆహ్వానితులకు మాత్రమే ఈ వీలు కల్పించనున్నట్లు చెప్పింది. మొదట్లో ఆరు లక్షల మందితో భారీ వేడుక ప్లాన్ చేసినప్పటికీ.. తర్వాత మూడు లక్షలకు తగ్గించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని