Jay Shah: రోహిత్‌ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌నకు భారత్‌

జూన్‌ నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో రోహిత్‌ శర్మ సారథ్యంలోనే భారత జట్టు బరిలో దిగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.

Updated : 14 Feb 2024 22:46 IST

రాజ్‌కోట్‌: బీసీసీఐ కార్యదర్శి జై షా (Jay Shah) కీలక ప్రకటన చేశారు. జూన్‌ నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ (T20 WorldCup 2024) టోర్నీలో రోహిత్‌ శర్మ (Rohit Sharma)సారథ్యంలోనే భారత జట్టు బరిలో దిగుతుందని వెల్లడించారు. ఈసారి టీమ్‌ఇండియా (Team India) కచ్చితంగా ప్రపంచ కప్‌ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2023 వన్డే ప్రపంచకప్‌లో 10 విజయాలు సాధించిన టీమ్‌ఇండియా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో ఓడినప్పటికీ హృదయాలు గెలుచుకుందన్నారు. 2024లో జరగబోయే టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్‌ జెండా రెపరెపలాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్‌లో యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ ఇరు దేశాలు సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీని నిర్వహిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని