కొమ్ముల మొసలి గుట్టు రట్టు

అంతరించిపోయిన కొమ్ముల మొసలి మీద చాలాకాలంగా నెలకొన్న వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ పరిశోధకులు దీన్ని సాధించారు. ఇది మామూలు

Updated : 02 Jun 2021 04:34 IST

అంతరించిపోయిన కొమ్ముల మొసలి మీద చాలాకాలంగా నెలకొన్న వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ పరిశోధకులు దీన్ని సాధించారు. ఇది మామూలు మొసళ్లకు అతి సన్నిహితమైందని జన్యు విశ్లేషణలో బయటపడింది. పిరమిడ్ల నిర్మాణం జరుగుతున్న సమయంలో కొమ్ముల మొసలి మడగాస్కర్‌ ద్వీపంలో దాగుందని భావిస్తున్నారు. దాదాపు 150 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నా, దీని మూలాల వివాదాలు అలాగే ఉన్నాయి. దీన్ని 1870లో తొలిసారి మొసళ్ల వంశంలో కొత్త సంతతిగా అభివర్ణించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో దీన్ని పురాతన నైల్‌ మొసలిగా విశ్లేషించారు. చివరిసారి శిలాజ నమూనాల భౌతిక లక్షణాలు అధ్యయనం చేసి, ఇది మామూలు మొసలి కాదని, మరుగుజ్జు మొసళ్లతో కూడిన సమూహంలో ఒకటని తీర్మానించారు. ఇన్నాళ్లకి తాజా అధ్యయనంతో దీని అసలు మూలాలు దొరికినట్టయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని